తదుపరి వార్తా కథనం

Balavinder Singh sahni: భారత బిలియనీర్‌కు దుబాయ్ కోర్టులో ఐదేళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా!
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 06, 2025
09:22 am
ఈ వార్తాకథనం ఏంటి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుగాంచిన భారత బిలియనీర్ బల్వీందర్ సింగ్ సాహ్నీ అరెస్టు అయ్యారు.
మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఆయన దోషిగా తేలిన నేపథ్యంలో, దుబాయ్ కోర్టు ఆయనకు ఐదేళ్ల కారాగార శిక్షను ఖరారు చేసింది.
కేవలం జైలు శిక్షే కాకుండా, రూ. కోటి జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాక, సాహ్నీకి చెందిన ఆస్తుల స్వాధీనానికి కూడా కోర్టు ఆదేశించింది.
శిక్షానుభవం పూర్తయ్యాక ఆయన్ని యుఏఇ దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు తుదితీర్పు ఇచ్చింది.
ఈ తీర్పుతో ప్రముఖ బిజినెస్‌మ్యాన్‌గా వెలుగులోకి వచ్చిన సాహ్నీ ప్రస్తుతం చట్టబద్ధంగా తీవ్ర సమస్యల్లో చిక్కుకున్నారు.