
Australia: ఆస్ట్రేలియాలో భారతీయుల వేడుకలకు అంతరాయం.. రెచ్చిపోయిన ఖలిస్థానీలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆస్ట్రేలియాలోని భారత కాన్సులేట్ కార్యాలయంలో కూడా ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈ సందర్భంలో ఖలిస్థానీ వర్గాలు అల్లర్లకు పాల్పడ్డాయి. మెల్‌బోర్న్‌లో త్రివర్ణ పతాక ఆవిష్కరణకు భారతీయులు కాన్సులేట్ వద్దకు చేరుకుని దేశభక్తి గీతాలు పాడుతుండగా, కొందరు ఖలిస్థానీలు అక్కడికి చేరి తమ జెండాలను ఊపుతూ నినాదాలు ప్రారంభించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని, ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా భద్రతా చర్యలు చేపట్టారు.
Details
హిందూ ఆలయంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు
ఇటీవల మెల్‌బోర్న్‌లోని ఒక హిందూ ఆలయంపై గుర్తుతెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాసిన ఘటన చోటు చేసుకుంది. ఆలయ గోడలపై హిట్లర్ చిత్రాన్ని ఉంచి, దానిపై 'గో హోమ్ బ్రౌన్' అంటూ రాశారు. అంతకుముందు కూడా కొందరు దుండగులు ఒక భారతీయ విద్యార్థిపై దాడి చేసి, జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తించాల్సిందే. ఇక ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్‌తో తమ సుదీర్ఘ స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని, న్యూదిల్లీ విజయాలను తామూ ఉత్సాహంగా జరుపుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.