LOADING...
Dubai Duty Free: దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో భారతీయుడికి రూ.9.58 కోట్ల జాక్‌పాట్
దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో భారతీయుడికి రూ.9.58 కోట్ల జాక్‌పాట్

Dubai Duty Free: దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో భారతీయుడికి రూ.9.58 కోట్ల జాక్‌పాట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2026
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని దుబాయ్‌లో నివసిస్తున్న భారతీయుడు మదన్‌కు భారీ అదృష్టం కలిసి వచ్చింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ నిర్వహించిన లక్కీ డ్రాలో ఆయన రూ.9.58 కోట్ల (సుమారు) భారీ నగదు బహుమతిని సొంతం చేసుకున్నారు. బుధవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కాంకోర్స్‌-సి వద్ద నిర్వహించిన డ్రాలో మదన్‌ విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన, గెలుచుకున్న మొత్తాన్ని దుబాయ్‌లోనే ఆస్తుల కొనుగోలుకు పెట్టుబడిగా వినియోగించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విజయం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్న మదన్‌, భవిష్యత్‌ ప్రణాళికల్లో భాగంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూఏఈలో భారతీయుడి అదృష్టం.. డ్యూటీ ఫ్రీ డ్రాలో రూ.9.58 కోట్లు గెలుపు

Advertisement