US: అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థిని అదృశ్యం.. పోలీసుల గాలింపు.. కుట్రపై అనుమానాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత సంతతికి చెందిన 20 ఏళ్ల విద్యార్థిని సుదీక్ష డొమినికన్ రిపబ్లిక్‌లోని ఓ రిసార్ట్ బీచ్‌లో హఠాత్తుగా అదృశ్యమైంది.
బికినీ ధరించి బీచ్‌లో నడుస్తున్న సమయంలో ఆమె కనిపించకుండా పోయింది.
మార్చి 6న స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
సుదీక్ష కనిపించకపోవడంతో ఆమె స్నేహితులు ఈ విషయాన్ని స్థానిక అధికారులకు తెలియజేశారు. అప్పటి నుంచి అధికారులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, సుదీక్ష పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటోంది.
గురువారం తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. డొమినికన్ రిపబ్లిక్‌లోని బీచ్‌లో బికినీ ధరించి నడుస్తుండగా ఆకస్మాత్తుగా మాయమైంది.
వివరాలు
గాలింపు చర్యలు ప్రారంభం
ఈ విషయం గురువారం సాయంత్రం అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి.
సుదీక్ష ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు, నల్లటి జుట్టు, గోధుమ రంగు కళ్లు కలిగిన యువతి.
అదృశ్యమైన సమయంలో ఆమె గోధుమ రంగు బికినీ ధరించి ఉంది. ఆమె చెవులకు పెద్ద గుండ్రని చెవిపోగులు, కుడి కాలి మీద మెటల్ డిజైనర్ చీలమండ, కుడి చేతిలో పసుపు, స్టీల్ బ్రాస్‌లెట్‌లు, ఎడమ చేతిలో బహుళ వర్ణ పూసల బ్రాస్‌లెట్ ధరించి ఉన్నట్లు గుర్తించారు.
సుదీక్ష కోసం పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయ అధికారులు,కుటుంబ సభ్యులు,వర్జీనియాలోని స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నారు.
ఆమెను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రతినిధి జారెడ్ స్టోన్‌సిఫర్ తెలిపారు.
వివరాలు
సుదీక్ష అదృశ్యమైన విధానం అనుమానాస్పదం
ప్రస్తుతం ఆమె కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు. సుదీక్ష ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటోంది.
2026లో పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలిగా గ్రాడ్యుయేట్ర్ అవ్వనుంది.
అంతకుముందు వర్జీనియాలోని అలెగ్జాండ్రియాలో ఉన్న థామస్ జెఫెర్సన్ హై స్కూల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యను అభ్యసించింది.
అయితే, ఆమె డిగ్రీ కోర్సు గురించి స్పష్టమైన సమాచారం లేదు. సుదీక్ష అదృశ్యమైన విధానం అనుమానాస్పదంగా మారింది.
బీచ్‌లో అనేక మంది పర్యాటకులు ఉన్న సమయంలో ఆమె కనిపించకుండా పోయింది.
దీంతో ఈ ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని అవకాశాలను పరిశీలిస్తూ విచారణను కొనసాగిస్తున్నారు.