
canada: కెనడాలో 16మంది మృతికి కారణమైన భారత సంతతి ట్రక్ డ్రైవర్ బహిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి కారకుడైన జసికిరత్ సింగ్ సిధ్దూని భారత్ కు పంపేయాలని ఆ దేశం శుక్రవారం నిర్ణయించింది.
అతగాడు ఆరు సంవత్సరాల క్రితం కెనడాలో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు.
సిధ్దూ సాధారణ ట్రక్కు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 2014లో సిధ్దూ కెనడాకు వలస వచ్చాడు.
సస్కట్చేవాన్ ప్రావిన్స్‌లోని టిస్‌డేల్ సమీపంలోని ఓ జంక్షన్ వద్ద హంబోల్ట్ బ్రోంకోస్ జూనియర్ హాకీ జట్టు బస్సు మార్గంలోకి ప్రవేశించింది.
అదే సమయంలో సిధ్దూ నడుపుతున్న ట్రక్కు హాకీ జట్టు బస్సును ఢీకొట్టింది.
Details
జూనియర్ హాకీ జట్టు మొత్తం తుడిచి పెట్టుకు పోయింది
ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృత్యు వాత పడ్డారు. మరో 13 మంది గాయపడ్డారు.
దీనిపై విచారించిన కోర్టు అతనిని దేశం నుంచి పంపేయాలని ఫెడరల్ కోర్ట్ ఆదేశించింది.
దీనికి ఇమ్మిగ్రేషన్,రెఫ్యూజీ బోర్డు శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. 2018లో జరిగినబస్సు ప్రమాదంలో ప్రమాదకరమైన డ్రైవింగ్‌కు ఎనిమిదేళ్ల శిక్ష విధించారు.
ఆ తర్వాత అతనికి పెరోల్ మంజూరైంది.ఇదిలా వుంటే శాశ్వత నివాస హోదా కోసం సిద్ధూ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకునే ప్రక్రియ మొదలైంది.
ఇది సంవత్సరాలు పట్టవచ్చని ఆయన తరపు న్యాయవాది గ్రీన్ అన్నారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు సిద్ధూను వెనక్కు పంపాలని కోరారని సిబిసి న్యూస్ తెలిపింది.