LOADING...
Youngest Mayor in UK: బ్రిటన్‌లో మేయర్‌గా అతిపిన్న వయస్కుడైన భారత సంతతి యువకుడి రికార్డు
బ్రిటన్‌లో మేయర్‌గా అతిపిన్న వయస్కుడైన భారత సంతతి యువకుడి రికార్డు

Youngest Mayor in UK: బ్రిటన్‌లో మేయర్‌గా అతిపిన్న వయస్కుడైన భారత సంతతి యువకుడి రికార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
May 18, 2026
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సంతతికి చెందిన యువకుడు తుషార్‌ కుమార్‌ బ్రిటన్‌లో అరుదైన ఘనత సాధించారు. కేవలం 23ఏళ్ల వయసులోనే మేయర్‌గా ఎన్నికై.. ఆ దేశంలో ఈ పదవి చేపట్టిన అతిపిన్న భారత సంతతి వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇటీవల ఎల్‌స్ట్రీ అండ్‌ బోర్హమ్‌వుడ్‌ పట్టణ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. లండన్‌లోని కింగ్స్‌ కళాశాలలో రాజకీయ శాస్త్రం అభ్యసించిన తుషార్‌కు చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉండేది. ఈఆసక్తితో ఆయన లేబర్‌ పార్టీలో చేరారు.కేవలం 20ఏళ్ల వయసులోనే 2023లో కౌన్సిలర్‌గా ఎన్నికై రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అనంతరం ఎల్‌స్ట్రీ అండ్‌ బోర్హమ్‌వుడ్‌ పట్టణ మండలిలో ఉప మేయర్‌గా కూడా సేవలందించారు. ఆయన సేవలు,నిబద్ధతను గుర్తించిన మండలి సభ్యులు ఇటీవల జరిగిన సమావేశంలో మేయర్‌గా ఎన్నుకొన్నారు.

వివరాలు 

తుషార్‌ తల్లి ప్రవీణ్‌ రాణి ఉప మేయర్‌గా బాధ్యతలు

అతి చిన్న వయసులోనే బ్రిటన్‌లో మేయర్‌ పదవి చేపట్టిన భారత సంతతి వ్యక్తిగా తుషార్‌ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో చురుకుగా కొనసాగుతూనే ఉన్నత విద్యను కూడా కొనసాగిస్తున్నారు. తుషార్‌ తల్లి ప్రవీణ్‌ రాణి కూడా కౌన్సిలర్‌గా ఎన్నికై ప్రజాసేవలో కొనసాగుతున్నారు. గతంలో ఆమె ఉప మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తల్లి నుంచే ప్రేరణ పొంది రాజకీయాల్లోకి వచ్చినట్లు తుషార్‌ తెలిపారు.

Advertisement