Page Loader
Kyrgyzstan: కిర్గిస్థాన్ లో ఆంధ్రాకు చెందిన వైద్య విద్యార్థి మృతి   
కిర్గిస్థాన్ లో ఆంధ్రాకు చెందిన వైద్య విద్యార్థి మృతి

Kyrgyzstan: కిర్గిస్థాన్ లో ఆంధ్రాకు చెందిన వైద్య విద్యార్థి మృతి   

వ్రాసిన వారు Stalin
Apr 23, 2024
08:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

కిజికిస్తాన్‌ (kyrgyzstan)లో భారతీయ వైద్య విద్యార్థి ప్రమాదవశాత్తూ జలపాతం (Water fall)లో పడి మృతి చెందాడు. ఈ ఘటనకు చెందిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ (Andhra pradesh) లోని విశాఖపట్టణం (Visakhapatnam) సమీపంలోని అనకాపల్లికి (Anakapalli) చెందిన దాసరి చందు (20) (Dasari Chandu) కిజికిస్తాన్‌ లో రెండవ సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన మరో నలుగురు స్నేహితులతో కలసి ఆదివారం దాసరి చందు వాటర్‌ ఫాల్స్‌ చూసేందుకు వెళ్లాడు. అక్కడకు వెళ్లి జలపాతాన్ని చూస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ కాలుజారి అందులో పడిపోయాడు. దీంతో చందు మృతి చెందాడు.

Details

అనకాపల్లిలో  స్వీట్‌ షాప్‌ నిర్వహిస్తున్న చందు తండ్రి 

దాసరి చందు తండ్రి అనకాపల్లిలో ఓ స్వీట్‌ షాప్‌ నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న చందు తల్లిదండ్రులు అతడి మృతదేహాన్ని భారత్‌ కు రప్పించాల్సిందిగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కలిసి అభ్యర్థించారు. వెంటనే కిషన్‌ రెడ్డి కిజికిస్తాన్‌ లో ఉన్నతాధికారులతో మాట్లాడి చందు మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.