Page Loader
Canada: కెనడాలో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి
కెనడాలో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Canada: కెనడాలో భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2025
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలో ఓ భారతీయ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది.

అయితే ఈ మృతికి గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు.వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.

మృతురాలు తాన్యా త్యాగి,ఢిల్లీకి చెందినవారు.ఆమె కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు.

గురువారం నాడు ఆమె అకాల మరణం జరిగింది. అయితే,ఆమె మరణానికి గల నిజమైన కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఈ విషాద ఘటనపై స్పందించిన భారత కాన్సులేట్, తాన్యా కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసింది.

అలాగే, వారి కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది.

తాన్యా మృతికి గల కారణాలను వెలికితీయేందుకు సంబంధిత అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత కాన్సులేట్ చేసిన ట్వీట్