Loading...
Canada: కెనడాలో ఉన్నత విద్యకు వెళ్లేవారికి కొత్త నిబంధన.. ఖాతాలో ఇంత ఉండాల్సిందే!
కెనడాలో ఉన్నత విద్యకు వెళ్లేవారికి కొత్త నిబంధన.. ఖాతాలో ఇంత ఉండాల్సిందే!

Canada: కెనడాలో ఉన్నత విద్యకు వెళ్లేవారికి కొత్త నిబంధన.. ఖాతాలో ఇంత ఉండాల్సిందే!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 01, 2026
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే విదేశీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. కెనడా స్టడీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు ఇకపై తమ ఏడాది జీవన వ్యయాలను భరించేందుకు మరింత మొత్తంలో నిధులు ఉన్నట్లు చూపించాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త నిబంధన సెప్టెంబర్‌ 1, 2026 నుంచి ఏడాది జీవన ఖర్చులకు సరిపడా 23,448 కెనడియన్‌ డాలర్లు.. అంటే సుమారు రూ.16 లక్షలు తమ వద్ద ఉన్నట్లు దరఖాస్తులో పేర్కొనాలి. ఈ మేరకు ఇమిగ్రేషన్,రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) ఆర్థిక అర్హత నిబంధనలను సవరించింది. క్యూబెక్‌ మినహా కెనడాలోని మిగతా అన్ని రాష్ట్రాలకు వెళ్లే విదేశీ విద్యార్థులు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలి.

వివరాలు 

జీవన ఖర్చులకు ప్రత్యేకంగా నిధుల ఆధారం

కెనడాలో చదువుల కోసం వెళ్లే విద్యార్థులు తమ ఆర్థిక పరిస్థితిపై ఇమిగ్రేషన్‌ అధికారులకు స్పష్టమైన ఆధారాలు చూపించాలి.

ఏడాది పాటు అక్కడ నివాసం, ఆహారం, రవాణా వంటి ప్రాథమిక అవసరాలను తీర్చుకునేందుకు సరిపడా డబ్బు తమ వద్ద ఉందని నిరూపించాల్సి ఉంటుంది.

ఈ మొత్తంలో ట్యూషన్‌ ఫీజు, కెనడాకు వెళ్లేందుకు అయ్యే ప్రయాణ ఖర్చులు కలపరు.

ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి ఏడాది జీవన వ్యయాల కోసం చూపించాల్సిన మొత్తం 22,895 కెనడియన్‌ డాలర్లు ఉండగా.. సెప్టెంబర్‌ 1 నుంచి దాన్ని 23,448 డాలర్లకు పెంచారు.

వివరాలు 

కుటుంబంతో వెళ్లేవారికి మరింత భారం

కుటుంబ సభ్యులతో కలిసి కెనడాకు వెళ్లే విద్యార్థులకు ఈ ఆర్థిక భారం మరింత పెరగనుంది.

దరఖాస్తుదారుతో పాటు మరో కుటుంబ సభ్యుడు.. అంటే మొత్తం ఇద్దరు ఉంటే, ఏడాది జీవన వ్యయాలకు 29,192 కెనడియన్‌ డాలర్లు.. దాదాపు రూ.19 లక్షలు ఉన్నట్లు చూపించాలి.

కెనడా స్టడీ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసే సమయంలోనే విద్యార్థులు తమ ఆర్థిక సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి.

ట్యూషన్‌ ఫీజు, ప్రయాణ ఖర్చులకు అదనంగా నివాసం, ఆహారం, రవాణా వంటి రోజువారీ అవసరాలను భరించేందుకు అవసరమైన నిధులు తమ ఖాతాల్లో లేదా ఆమోదయోగ్యమైన ఆర్థిక ఆధారాల్లో ఉన్నట్లు చూపించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT