US Student Visa: US F-1 వీసాలలో తగ్గిన భారతీయ విద్యార్థులు వీసాలు
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడం అనేది చాలా మందికి కల. ముఖ్యంగా అమెరికాలో చదవాలని మరింత మంది ఆకర్షితులవుతున్నారు. అందుకే ప్రతి సంవత్సరం మన దేశం నుంచి వేల మంది విద్యార్థులు US స్టూడెంట్ వీసా(F-1 Visa) ద్వారా అమెరికాకు వెళ్తుంటారు. కానీ,ఈ సంవత్సరం ఈ సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. 2023 తొలి తొమ్మిది నెలల్లో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన F-1 వీసాల సంఖ్య 38శాతం తగ్గిందని అమెరికా విదేశాంగ శాఖ గణాంకాలు వెల్లడించాయి. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నివేదిక ప్రకారం,2023 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 64,008 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేయబడగా, 2022 ఇదే సమయంలో 1,03,495 మంది విద్యార్థులకు వీసాలు మంజూరయ్యాయి.
అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థుల్లో అగ్రస్థానంలో భారత్
కోవిడ్ తర్వాత భారతీయ విద్యార్థులకు వీసాల జారీ ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. 2021లో 65,235 మంది విద్యార్థులకు వీసాలు అందగా, 2022లో ఈ సంఖ్య 93,181కి పెరిగింది. ఈ తగ్గుదల భారతీయులకే కాకుండా చైనా విద్యార్థులకు కూడా ప్రభావం చూపింది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 73,781 మంది చైనీస్ విద్యార్థులకు వీసాలు జారీ చేయగా, 2022 ఇదే సమయంలో ఈ సంఖ్య 80,603గా ఉంది. ఇదిలాఉండగా, అమెరికాలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. 2023-24 విద్యా సంవత్సరానికి 3.30 లక్షల మంది భారతీయ విద్యార్థులతో మన దేశం చైనాను వెనక్కి నెట్టింది.
ఎఫ్-1 వీసా అంటే ఏమిటి?
చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398 మాత్రమే. అమెరికాలో మొత్తం 11.26 లక్షల అంతర్జాతీయ విద్యార్థుల్లో 29 శాతం మన దేశానికి చెందినవారే. ఎఫ్-1 వీసా ఒక నాన్-ఇమిగ్రెంట్ వీసా. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అమెరికాలో పూర్తి సమయ విద్యను అభ్యసించేందుకు అనుమతిస్తుంది. అమెరికా విద్యాసంస్థలు సంవత్సరానికి రెండుసార్లు ప్రవేశాలను అందిస్తాయి. సాధారణంగా, ఆగస్టు-డిసెంబర్ సెమిస్టర్ సమయంలో భారత విద్యార్థులు ఎక్కువగా అమెరికాకు వెళ్తుంటారు.