LOADING...
Babljeet Kaur:  గ్రీన్ కార్డ్ అపాయింట్‌మెంట్‌లో కలకలం.. 30 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న బబ్లీజీత్ కౌర్ అరెస్ట్!
30 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న బబ్లీజీత్ కౌర్ అరెస్ట్!

Babljeet Kaur:  గ్రీన్ కార్డ్ అపాయింట్‌మెంట్‌లో కలకలం.. 30 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న బబ్లీజీత్ కౌర్ అరెస్ట్!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో 30 ఏళ్లు నివసిస్తున్న 60 ఏళ్ల భారతీయ మహిళ బబ్లీజీత్ కౌర్,అలియాస్ బబ్లీ,తన గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి దశలో ఉండగా,ఇమ్మిగ్రేషన్ అధికారుల చేతిలో అరెస్ట్ అయ్యారు. ఈ సంఘటన బబ్లీజీత్ గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్‌మెంట్‌కి వెళ్తుండగా చోటు చేసుకుంది. వివరాల ప్రకారం,1994 నుండి అమెరికాలో నివసిస్తున్న బబ్లీజీత్ కౌర్,డిసెంబర్ 1న యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) కార్యాలయానికి వెళ్లారు. ఆమె ఫ్రంట్ డెస్క్ వద్ద ఉన్నప్పుడు, పలువురు ఫెడరల్ ఏజెంట్లు ఆ భవనంలో ప్రవేశించి, ఆమెను ప్రత్యేక గదిలోకి పిలిచి అరెస్ట్ చేసినట్లు ఆమె కుమార్తె జ్యోతి తెలిపారు. అటార్నీతో ఫోన్‌లో మాట్లాడే అవకాశం ఇచ్చినా, అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు 

లాంగ్ బీచ్ కమ్యూనిటీలో మంచి పేరున్న కౌర్ కుటుంబం 

అరెస్ట్ అయిన తర్వాత, కుటుంబ సభ్యులకు గంటల తరబడి ఆమెకు ఎక్కడ ఉన్నారో తెలియలేదు. తరువాత, ఆమెను అడెలాంటోలోని ICE డిటెన్షన్ సెంటర్‌కు తరలించినట్లు సమాచారం. బబ్లీజీత్ కౌర్ అమెరికా పౌరసత్వం కలిగిన కుమార్తె, గ్రీన్ కార్డ్ ఉన్న భర్త ద్వారా ఆమోదించబడిన గ్రీన్ కార్డ్ పిటిషన్ ఉందని లాంగ్ బీచ్ వాచ్‌డాగ్ తన కథనంలో పేర్కొంది. కౌర్ తన భర్తతో కలిసి లాంగ్ బీచ్ ప్రాంతంలో 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం"నటరాజ్ క్యూసిన్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్" అనే రెస్టారెంట్‌ను నడిపి, స్థానిక కమ్యూనిటీలో మంచి గుర్తింపు సంపాదించారు. ఈ ఘటనపై స్పందించిన స్థానిక కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా,ఆమెను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

వివరాలు 

ఇది ఒక పీడకల

కుటుంబ సభ్యులు ఆమె బెయిల్‌పై విడుదలకు సంబంధించిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. "ఇది ఒక పీడకలలా ఉంది. ఆమెను బయటకు తీసుకురావడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఆమె అక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు. ఇది పూర్తిగా అమానుషం" అని జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement