Indonesia train crash: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. ఏడుగురు మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జకార్తా సమీప ప్రాంతంలో ఒకే పట్టాలపై రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ నష్టం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో బెకాసి తిమూర్ రైల్వేస్టేషన్‌లో ప్యాసింజర్ రైలు ఆగి ఉంది. అదే పట్టాలపైకి మరో రైలు రావడంతో ప్రమాదం సంభవించింది.
వివరాలు
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
దీంతో బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. కొందరు భయంతో కేకలు వేస్తూ కిందకు దూకేశారు. వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో పలు బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. అత్యవసర సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి, బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు శ్రమించాయి. ఇప్పటివరకు ఏడుగురిమృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. డజన్ల కొద్దీ గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
గతంలో కూడా ఇటువంటి ఘటనలు
ఈ ప్రమాదానికి మౌలిక సదుపాయాల లోపం, సరైన నిర్వహణ లేకపోవడం కారణమై ఉండవచ్చని ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. అసలు కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇండోనేషియాలో ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి. 2024 జనవరిలో వెస్ట్ జావాలో జరిగిన ప్రమాదంలో నలుగురు సిబ్బంది మృతి చెందగా, ఇరవై నాలుగు మందికి పైగా గాయపడ్డారు. అలాగే 2015లో జకార్తాలో రైలు, చిన్న బస్సు ఢీకొన్న ఘటనలో పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ
इंडोनेशिया में भीषण ट्रेन हादसा
— NDTV India (@ndtvindia) April 28, 2026
इंडोनेशिया की राजधानी जकार्ता में देर रात एक बड़ा रेल हादसा हुआ, जिसमें एक ट्रेन दूसरी ट्रेन से टकरा गई. इस भीषण दुर्घटना में कम से कम 7 लोगों की मौत हो गई, जबकि कई यात्री गंभीर रूप से घायल हो गए. लोगों को बचाने के लिए राहत एवं बचाव कार्य जारी… pic.twitter.com/TEROl7Ffy2