Bangladesh: జకీర్ నాయక్‌కు బంగ్లాదేశ్‌లోకి నో ఎంట్రీ.. లా అండ్ ఆర్డర్ కారణంగా అనుమతి నిరాకరణ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో కేసులు ఎదుర్కొంటూ విదేశాల్లో తలదాచుకున్న వివాదాస్పద మతప్రచారకుడు జకీర్ నాయక్ (Zakir Naik) బంగ్లాదేశ్‌కు పర్యటనకు రావచ్చన్న వార్తలు ఇటీవల అంతర్జాతీయ మీడియాలో ప్రస్తావనకు వచ్చాయి. అయితే, అతడిని తమ దేశంలోకి ప్రవేశించనివ్వకూడదని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించినట్లు అక్కడి స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ నిర్ణయం మంగళవారం హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన లా అండ్ ఆర్డర్ కోర్ కమిటీ సమావేశంలో తీసుకున్నట్లు సమాచారం. జకీర్ నాయక్ బంగ్లాదేశ్‌కు వస్తే,అతని సభలకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ గుంపులను నియంత్రించేందుకు భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వివరాలు
జకీర్ బంగ్లాదేశ్‌ను సందర్శించే అవకాశం
అయితే, ప్రస్తుతం అంత పెద్ద మొత్తంలో సిబ్బంది ని సమకూర్చడం సాధ్యం కాకపోవడంతో, ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వకుండా తిరస్కరించినట్లు వెల్లడించారు. జకీర్ నాయక్ సందర్శన అంశంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను గమనించామని, పరారీలో ఉన్న లేదా నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఏ దేశం కూడా ఆశ్రయం ఇవ్వకూడదనే విషయంపై తాము నిలకడైన అభిప్రాయం కలిగిఉన్నామని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఎస్.ఎం మహబూబుల్ ఆలం తెలిపారు.
వివరాలు
భారత్ మోస్ట్ వాంటెడ్
2016 జూలైలో ఢాకాలోని ఒక బేకరీపై జరిగిన ఉగ్రదాడి తర్వాత, దాడిలో పాల్గొన్న వారిలో ఓ వ్యక్తి తనకు జకీర్ నాయక్ యూట్యూబ్ వీడియోల వల్ల ప్రభావం కలిగిందని చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఆ సంఘటన తర్వాత, భారత్‌లో ఉన్న జకీర్ అరెస్టు భయంతో మలేసియాకు వెళ్లిపోయి అక్కడే నివాసం ఏర్పరుచుకున్నాడు. దీనితో, మనీలాండరింగ్, విద్వేష ప్రసంగాల కేసుల నేపథ్యంలో భారత్ అధికారికంగా అతడిని వాంటెడ్ వ్యక్తిగా ప్రకటించింది. అదేవిధంగా, జకీర్ నాయక్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 20 వరకు భారత్‌లో పర్యటనకు రావచ్చన్న వార్తలు తాజాగా వెలువడ్డాయి. ఈ సందర్శనను దృష్టిలో ఉంచుకుని, అక్కడి ప్రభుత్వం అతనికి అధికారిక స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది.