
Sheikh Hasina: మాజీ ప్రధాని షేక్ హసీనా కోసం ఇంటర్‌పోల్ వేట ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.
దేశాన్ని వదిలి భారత్‌లో ఆశ్రయం పొందినప్పటికీ, బంగ్లా ప్రభుత్వం ఆమెపై దాడులు కొనసాగిస్తోంది.
తాజాగా బంగ్లాదేశ్‌లో ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన యూనస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం హసీనా, మాజీ మంత్రులు, అధికారులు కలిపి 12 మందిపై అరెస్ట్ వారెంట్‌లను జారీ చేసింది.
గతేడాది ఆగస్టు నుంచి హసీనా భారత్‌లోనే ఉంటున్నారు. భారత ప్రభుత్వ మద్దతుతో ఆమె ఇక్కడ తలదాచుకుంటున్నా, తాజాగా ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి.
Details
12మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి
ఈ నేపథ్యంలో ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన బంగ్లా పోలీసులు.. హసీనా సహా మిగిలిన 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని కోరారు.
ఒకవేళ రెడ్ నోటీసులు జారీ అయితే, వారు ఏ దేశంలో ఉన్నా అరెస్టు చేయడం సాధ్యమవుతుంది.
ఇక ఇటీవలే హసీనా కుటుంబాన్ని ఉద్దేశించిన మరిన్ని చర్యలతో బంగ్లా ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది.
ఆమె కుమారుడు సజీబ్ వాజిద్‌కి ఢాకా శివార్లలో ఇళ్ల స్థలాల కేటాయింపులో జరిగిన అవకతవకల కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
Details
ఏప్రిల్ 29లోగా నివేదిక ఇవ్వాలి
మొత్తం 16 మందిపై ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ ప్రత్యేక జడ్జి వారెంట్‌లను జారీ చేయగా, నిందితులంతా పరారీలో ఉన్నారని, ఏప్రిల్ 29లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించి, ఢాకా శివార్లలో ఉన్న పూర్వాచల్ న్యూటౌన్‌లో దౌత్యవేత్తల కోసం కేటాయించిన 1.86 ఎకరాల స్థలాన్ని హసీనా, ఆమె బంధువులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
దీనిపై గత డిసెంబర్‌లోనే బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ (ACC) దర్యాప్తును ప్రారంభించింది. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలతో ఆమెపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.