Page Loader
అమెరికాలో తెలుగు యువతి మృతిని అపహాస్యం చేస్తూ మట్లాడిన పోలీస్ ఆఫీసర్
అమెరికాలో తెలుగు యువతి మృతిని అపహాస్యం చేస్తూ మట్లాడిన పోలీస్ ఆఫీసర్

అమెరికాలో తెలుగు యువతి మృతిని అపహాస్యం చేస్తూ మట్లాడిన పోలీస్ ఆఫీసర్

వ్రాసిన వారు Stalin
Sep 13, 2023
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఈ ఏడాది జనవరిలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొని తెలుగు యువతి మరణించింది. అయితే ఆమె మరణం గురించి ఓ పోలీసు అధికారి నవ్వుతూ, అపహాస్యంగా మాట్లాడటం అతని బాడీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాడీకామ్ రికార్డు ఆధారంగా ఆ పోలీసు అధికారిపై సీటెల్ పోలీసు యూనియన్ దర్యాప్తు ప్రారంభించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. కర్నూలుకు చెందిన కందుల జాహ్నవి మాస్టర్స్ కోసం 2021 సెప్టెంబరులో అమెరికాకు వెళ్లింది. నార్త్ఈస్టర్న్ యూనవర్సీకి చెందిన సీటెల్ క్యాంపస్ ఆమె చదివింది. ఈ ఏడాది జనవరిలో కళాశాలకు వెళ్లి వస్తున్న క్రమంలో రహదారి దాటుతున్న సమయంలో పెట్రోలింగ్‌ వాహనం ఢీకొన్నది. దీంతో జాహ్నవి అక్కడికక్కడే చనిపోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యువతి మృతిని అపహాస్యం చేస్తూ మట్లాడిన పోలీస్ ఆఫీసర్