LOADING...
Iran-Oman: హోర్ముజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్-ఒమన్ తొలి సంయుక్త కమిటీ సమావేశం
హోర్ముజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్-ఒమన్ తొలి సంయుక్త కమిటీ సమావేశం

Iran-Oman: హోర్ముజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్-ఒమన్ తొలి సంయుక్త కమిటీ సమావేశం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్ముజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్, ఒమన్ తొలి సంయుక్త కమిటీ సమావేశాన్ని సోమవారం మస్కట్‌లో నిర్వహించాయి. ఈ సమావేశంలో ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది, ఒమన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అబ్దుల్ అజీజ్ అల్-హినాయ్ పాల్గొన్నారు. గల్ఫ్ తీర దేశాల సార్వభౌమ హక్కులు,హర్ముజ్ జలసంధి భవిష్యత్ నిర్వహణ, సముద్ర భద్రత వంటి కీలక అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. ఈ చర్చలు ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) నేపథ్యంలో జరిగాయి. ఆ ఒప్పందంలోని ఐదో పేరాలో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం హర్ముజ్ జలసంధి భవిష్యత్ నిర్వహణ, తీర ప్రాంత దేశాల హక్కుల పరిరక్షణపై అభిప్రాయాలు పంచుకున్నట్లు ఘరీబాబాది వెల్లడించారు.

వివరాలు 

హర్ముజ్ సంయుక్త కమిటీ తొలి సమావేశం

మస్కట్ పర్యటన సందర్భంగా హర్ముజ్ సంయుక్త కమిటీ తొలి సమావేశం విజయవంతంగా జరిగిందని ఆయన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పేర్కొన్నారు. ప్రస్తుతం జలసంధికి సంబంధించిన పరిస్థితులను సమీక్షించడంతో పాటు, భవిష్యత్‌లో ఈ వ్యూహాత్మక సముద్ర మార్గాన్ని ఎలా నిర్వహించాలనే అంశంపై ఒమన్‌తో సమగ్ర చర్చలు జరిపినట్లు తెలిపారు. ప్రపంచంలో అత్యంత కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధిలో సముద్ర రవాణా, ప్రాంతీయ స్థిరత్వం, పరిపాలన అంశాలపై ఇరాన్, ఒమన్ కలిసి పనిచేయాలనే సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఘరీబాబాది చేసిన ట్వీట్ 

Advertisement