F-35 Fighter Jet: రెండో ఎఫ్-35 కూల్చిచినట్లు ప్రకటించిన ఇరాన్..
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ తాజాగా అమెరికాకు చెందిన F-35 Fighter Jet ను కూల్చినట్లు ప్రకటించింది. ఈ ఘటన సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని Mehr News Agency వెల్లడించింది. ప్రమాదంలో పైలట్ తీవ్రంగా గాయపడి ఉండవచ్చని, అతడు ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇరాన్ ప్రకటన ప్రకారం, ఎఫ్-35 విమానాన్ని కూల్చడం ఇది రెండోసారి. అయితే ఈ ఘటనపై అమెరికా సైన్యానికి చెందిన యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. అమెరికాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ మాత్రం తన వైఖరిలో మార్పు చూపడం లేదు.
వివరాలు
ఇరాన్ మీడియా విడుదల చేసిన ఫోటోలపై అనుమానాలు
రాడార్ గుర్తింపును తప్పించుకునే స్టెల్త్ సామర్థ్యం ఉన్న ఎఫ్-35 వంటి అధునాతన యుద్ధ విమానాన్ని కూల్చినట్లు వస్తున్న వార్తలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి విమానాలు అత్యంత భద్రత ఉన్న వైమానిక ప్రాంతాల్లోనే వినియోగిస్తారు. ఇక ఇరాన్ మీడియా విడుదల చేసిన ఫోటోలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ చిత్రాల్లో కనిపిస్తున్న శకలాలు ఎఫ్-35 కు చెందినవి కావని, అవి F-15E Strike Eagle విమానానికి చెందినవిగా ఏరోస్పేస్ నిపుణులు భావిస్తున్నారు. ఈ అంశంపై కూడా అమెరికా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
వివరాలు
అమెరికా ఐదవ తరం యుద్ధ సాంకేతికతలో ఈ విమానం కీలక పాత్ర
రెండు వారాల క్రితం కూడా ఎఫ్-35 లైట్నింగ్ 2 విమానాన్ని కూల్చినట్లు ఇరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా ఐదవ తరం యుద్ధ సాంకేతికతలో భాగమైన ఈ విమానం కీలక పాత్ర పోషిస్తుంది. గత ఘటనపై కెప్టెన్ టిమ్ హాకిన్స్ స్పందిస్తూ, ఆ విమానం కంబాట్ మిషన్‌లో ఉండగా అత్యవసర ల్యాండింగ్ చేయించినట్లు తెలిపారు. అయితే, ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆ ఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేయడం కూడా గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
Mehr News Agency చేసిన ట్వీట్
Spokesman of Iran's Khatam al-Anbiya Headquarters:
— Mehr News Agency (@MehrnewsCom) April 3, 2026
🔺 A second US fifth-generation F-35 was struck and downed over central Iran.
🔺 Given the massive explosion on impact and during the crash, the pilot is unlikely to have ejected. pic.twitter.com/8TX4jsbebw