Loading...
US-Iran: హార్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి.. ఇరాన్‌ ప్రకటనను ఖండించిన అమెరికా
హార్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి.. ఇరాన్‌ ప్రకటనను ఖండించిన అమెరికా

US-Iran: హార్మూజ్‌లో అమెరికా నౌకపై దాడి.. ఇరాన్‌ ప్రకటనను ఖండించిన అమెరికా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 07, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

హార్మూజ్‌ జలసంధిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాకు చెందిన మానవరహిత నౌకపై దాడి చేసినట్లు ఇరాన్‌ ఆదివారం వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలను అమెరికా సైన్యం తీవ్రంగా ఖండించింది. ఇరాన్‌ చేసిన ప్రకటనలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. తమ నౌకపై ఎలాంటి దాడి జరగలేదని పేర్కొంది. హార్మూజ్‌ జలసంధిలో ఇరాన్‌కు చెందిన మూడు చమురు నౌకలపై అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఇరాన్‌.. అమెరికా నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. అయితే అమెరికా మాత్రం తమ నౌకపై దాడి జరిగిందన్న ఇరాన్‌ వాదనను తోసిపుచ్చింది.

వివరాలు 

మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు

పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయనడానికి తాజా పరిణామం నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో హార్మూజ్‌లో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

హార్మూజ్‌పై ఇరాన్‌ పట్టు పెంచుకునే యత్నం

ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు రవాణాకు అత్యంత కీలకమైన మార్గాల్లో హార్మూజ్‌ జలసంధి ఒకటి.

ఈ ప్రాంతంపై తన నియంత్రణ, ప్రభావాన్ని మరింత పెంచుకునేందుకు ఇరాన్‌ ప్రయత్నిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

తాజా పరిణామాలు హార్మూజ్‌ జలసంధిలో భద్రత, అంతర్జాతీయ ఇంధన రవాణాపై మరోసారి ఆందోళనలు పెంచుతున్నాయి.

ADVERTISEMENT