Loading...
Iran: ఇజ్రాయెల్‌పై భారీ దాడికి ఇరాన్‌ ప్లాన్‌.. హమాస్‌, హెజ్‌బొల్లా, హౌతీలతో జట్టు!
ఇజ్రాయెల్‌పై భారీ దాడికి ఇరాన్‌ ప్లాన్‌.. హమాస్‌, హెజ్‌బొల్లా, హౌతీలతో జట్టు!

Iran: ఇజ్రాయెల్‌పై భారీ దాడికి ఇరాన్‌ ప్లాన్‌.. హమాస్‌, హెజ్‌బొల్లా, హౌతీలతో జట్టు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2026
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాతో కలిసి తమ దేశంపై దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్‌ భావిస్తోంది. తమ దేశాధినేతల మరణానికి కారణమైన వారిని అంతం చేస్తామని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన ఆ దేశం.. ఇప్పుడు ఇజ్రాయెల్‌పై భారీ దాడికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు కీలక విషయాలను వెల్లడించాయి. ఇజ్రాయెల్‌పై భారీ స్థాయిలో దాడులు చేపట్టేందుకు ఇరాన్‌ ప్రణాళికలు రచిస్తోందని ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు పేర్కొన్నాయి. తమ దేశాన్ని అన్ని వైపుల నుంచి ఒకేసారి లక్ష్యంగా చేసుకునేందుకు ఇరాన్‌.. హెజ్‌బొల్లా, హమాస్‌, హౌతీలు, ఇరాక్‌లోని సాయుధ ముఠాలతో కలిసి పనిచేస్తోందని ఆరోపించాయి.

వివరాలు

దాడి మరింత తీవ్రం

భవిష్యత్తులో ఇజ్రాయెల్‌పై జరగబోయే ఈ దాడి.. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ చేపట్టిన దాడి కంటే మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేశాయి.

ఇందులో భాగంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC).. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, హమాస్‌, యెమెన్‌లోని హౌతీలతో కలిసి తన బలగాలను మోహరించాలని భావిస్తున్నట్లు వెల్లడించాయి.

ఈ అంశంపై ఇజ్రాయెల్‌కు చెందిన ఓ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది.

వివరాలు

మిత్రదేశాలతో కలిసి దాడికి ప్రణాళిక

నిఘా వర్గాల వివరాల ప్రకారం.. 2023 అక్టోబర్‌ 7న హమాస్‌ చేపట్టిన దాడి అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది.

దీంతో ఈసారి ఇరాన్‌ తన మిత్రదేశాలతో కలిసి ఇజ్రాయెల్‌పై మరింత పెద్ద దాడికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాలను ఒకేసారి లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాలనేది ఈ ప్రణాళికలో భాగమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

హమాస్‌ నాయకత్వంలో చోటుచేసుకున్న మార్పు కూడా ఇందుకు ఓ కారణంగా చెబుతున్నారు. జులైలో హమాస్‌ అత్యున్నత నాయకుడిగా ఖలీల్‌ అల్‌-హయ్యా ఎన్నికయ్యారు. ఆయనకు ఇరాన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

దీంతో ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకునే లక్ష్యంతో ఇరాన్‌, హమాస్‌ మరోసారి ఏకమయ్యాయని తెలిపాయి..

ADVERTISEMENT

వివరాలు

ఆయుధాల ఉత్పత్తిని వేగవంతం చేస్తున్న ఇరాన్

ప్రతిపాదిత దాడి కోసం ఇరాన్‌ ఇప్పటికే కొన్ని బృందాలను, సమన్వయ యంత్రాంగాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్‌తో జరుగుతున్న ఘర్షణను మరింత విస్తరించే అంశంపై హెజ్‌బొల్లా, హౌతీలు, ఇరాకీ మిలీషియాల్లోని కమాండర్లతో ఐఆర్‌జీసీకి చెందిన ఖుద్స్‌ ఫోర్స్‌ ఉన్నతాధికారులు చర్చలు జరిపినట్లు సమాచారం.

ఐఆర్‌జీసీకి చెందిన ఇద్దరు సీనియర్‌ అధికారులు, ఖుద్స్‌ ఫోర్స్‌ ఉన్నతాధికారులు, ఇతర కమాండర్లతో కాన్ఫరెన్స్‌ కాల్స్‌ నిర్వహించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఇరాన్‌కు చెందిన సలహాదారులు కూడా క్షేత్రస్థాయిలో ఆయా బలగాలతో కలిసి పనిచేసినట్లు పేర్కొన్నాయి.

ఇదే సమయంలో ఇరాన్‌ తన సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT