IAEA: భారీ స్థాయిలో అణు ఇంధన శుద్ధికి ఇరాన్ ప్లాన్..6,000 అదనపు సెంట్రిఫ్యూజ్‌ల ఏర్పాటు
ఇరాన్ భారీ స్థాయిలో అణు ఇంధన శుద్ధి పనులను ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేసిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) పేర్కొంది. ఈ ప్రణాళికలో భాగంగా 6,000 అదనపు సెంట్రిఫ్యూజ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ చర్య ఐఏఈఏ 35 దేశాల బోర్డ్ గవర్నర్స్ గత వారం తీసుకున్న తీర్మానానికి ప్రతిచర్యగా తీసుకోవడం జరిగింది. ఈ తీర్మానం అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ అభ్యర్థన మేరకు అనుమతినిచ్చారు. అదనపు సెంట్రిఫ్యూజ్‌ల ద్వారా ఇరాన్ తన అణు ఇంధన శుద్ధి సామర్థ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. సాధారణంగా 60 శాతం శుద్ధి చేసిన యురేనియాన్ని పౌర అవసరాలకు ఉపయోగిస్తారు. అయితే,90 శాతానికి పైగా శుద్ధి చేస్తే, అది అణు బాంబుల తయారికే ఉపయోగపడుతుంది.
ఇరాన్ వద్ద 10,000 సెంట్రిఫ్యూజ్‌లు
ప్రస్తుతం ఇరాన్ వద్ద 10,000 సెంట్రిఫ్యూజ్‌లున్నాయి, ఇవి నటాంజ్, ఫార్డో వంటి భూగర్భ అణు కేంద్రాలలో అమర్చబడి ఉన్నాయి. నటాంజ్‌లో భూమి ఉపరితలంపై కూడా ఒక ప్లాంట్ అమర్చి, 160 యంత్రాలతో కూడిన 32 క్లస్టర్లను ఏర్పాటు చేయాలని పథకాన్ని రూపొందించింది. గత వారం ఐఏఈఏ త్రైమాసిక సమావేశంలో ఇరాన్ ప్రతినిధులు తమ దేశం 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై పరిమితులు విధించే సూత్రాన్ని ప్రతిపాదించారు. అదేవిధంగా, ఐఏఈఏ బోర్డు తమ దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి తీర్మానం చేయకూడదని వారు పేర్కొన్నారు.