LOADING...
'f(f(O))>f(O)': అమెరికాకు ఇరాన్‌ గణిత హెచ్చరిక.. దాని అర్థమేంటో..?
'f(f(O))>f(O)': అమెరికాకు ఇరాన్‌ గణిత హెచ్చరిక.. దాని అర్థమేంటో..?

'f(f(O))>f(O)': అమెరికాకు ఇరాన్‌ గణిత హెచ్చరిక.. దాని అర్థమేంటో..?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 13, 2026
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాతో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలకు ఇరాన్‌ పార్లమెంట్ స్పీకర్‌ ఘాలిబఫ్‌ వ్యంగ్యంగా స్పందించారు. ఇరాన్‌ సామాజిక మాధ్యమం ద్వారా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం పెట్రోలు ధరలు తక్కువగా ఉన్నాయని, అవి త్వరలో పెరిగే అవకాశముందని అమెరికా ప్రజలను హెచ్చరించారు. ఇప్పుడున్న ధరలను ఆస్వాదించండి, దిగ్బంధం తర్వాత ధరలు పెరిగితే ఇబ్బందులు తప్పవని ఆయన వ్యాఖ్యానించారు.

వివరాలు 

వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

ఈ వ్యాఖ్యలతో పాటు ఆయన ఒక గణిత సమీకరణాన్ని కూడా పంచుకున్నారు. 'ΔO_BSOH>0 ⇒ f(f(O))>f(O)' అనే ఈ సమీకరణ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఈ సమీకరణ అర్థం ఏమిటన్న దానిపై నెటిజన్లు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది దీనిని ఇలా విశ్లేషించారు: దిగ్బంధం జరిగితే చమురు సరఫరా తగ్గుతుంది. సరఫరా తగ్గితే ధరలు సాధారణంగా కాకుండా వేగంగా పెరుగుతాయి. అదే ఈ సమీకరణ సూచిస్తున్నదని వారు అంటున్నారు.

వివరాలు 

ఇరాన్‌పై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్‌ సిద్ధం 

మరోవైపు, సరఫరా పరిమితమైతే మార్కెట్‌పై ఒత్తిడి పెరిగి ధరలు మరింత పెరుగుతాయని కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడున్న తక్కువ ధరలను ఉపయోగించుకోవాలని ఘాలిబఫ్‌ సూచించినట్లు భావిస్తున్నారు. ఇక శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధిని దిగ్బంధించే అవకాశాన్ని US Central Command ఇప్పటికే సూచించింది. ఇదే సమయంలో ఇరాన్‌పై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్‌ సిద్ధమవుతున్నాయన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలతో పశ్చిమాసియా ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చమురు సరఫరా, ధరలపై ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమైంది.

Advertisement