IRAN : షాకింగ్.. ద్వారాలు మూసేసిన ఇరాన్..ఇక చర్చల్లేవ్..చర్చించుకోవడాల్లేవ్!
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు సమీపిస్తున్న సమయంలో, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో జరుగుతున్న శాంతిచర్చల కోసం అన్ని ద్వారాలు మూసేశారని ఇరాన్ అధికార మీడియా సంస్థ టెహ్రాన్ టైమ్స్ వెల్లడించింది. టెహ్రాన్ టైమ్స్ 'ఎక్స్' వేదికపై ప్రకటించిన ప్రకారం, "అమెరికాతో ఉన్న అన్ని దౌత్య మార్గాలు, పరోక్ష సంభాషణ మార్గాలను ఇరాన్ పూర్తిగా మూసివేసింది. ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడి కూడా నిలిపివేశారు" అని పేర్కొన్నారు.
వివరాలు
చర్చలు లేవని తేల్చి చెప్పిన ఇరాన్
ట్రంప్ నిర్ణయించిన గడువు భారత సమయానుసారం బుధవారం ఉదయం 5:30 గంటలకు (అమెరికా సమయానుసారం మంగళవారం రాత్రి 8 గంటలకు) ముగియనుంది. ఆ సమయానికి హర్మూజ్‌ను తెరవకపోతే, ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామన్న హెచ్చరిక ట్రంప్ ఇచ్చారు. తాజాగా ఇరాన్ కూడా నేటి రాత్రికి అంతమయ్యే అవకాశముందని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, ఇరాన్ మాట్లాడింది. "అమెరికా, దాని మిత్రదేశాలు కూడా తమ శిక్షను అనుభవిస్తాయి" అని తెలిపింది. ఈ నేపథ్యంలో, ఈజిప్టు, పాకిస్థాన్, తుర్కీ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న రెండు దేశాల మధ్య చర్చలు ముగిశాయని ప్రకటించారు. గతంలో, శాంతిచర్చల భాగంగా 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించిన విషయం తెలిసిందే.