Iran-India-Cargo ship: నౌకా సిబ్బందిని కలిసేందుకు భారత ఉన్నతాధికారుల్ని అనుమతిస్తాం: ఇరాన్ మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ భారత్ ను కరుణించింది. ఇజ్రాయెల్ కార్గో నౌకలో ఉన్న భారత నౌకా సిబ్బందిని విడిపించుకునేందుకు భారత ప్రభుత్వ ఉన్నతాధికారుల్ని అనుమతిస్తామని ఇరాన్ వెల్లడించింది.
ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి హుస్సేన్ అమిరాబ్దుల్లహన్ చెప్పారు.
స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ వద్ద ఇరాన్ మిలిటరీ స్వాధీనం చేసుకున్నఇజ్రాయెల్ కు చెందిన నౌకలో భారత్ కు చెందిన 17 మంది నౌక సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వారిని విడిపించేందుకు ఇరాన్ చొరవ తీసుకోవాల్సిందిగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కోరారు.
దీనికి స్పందించిన ఇరాన్ ప్రభుత్వం..కార్గో నౌకలో ఉన్న భారత నేవీ సిబ్బంది విడుదల గురించి మాట్లాడేందుకు భారత ఉన్నతాధికారుల్ని టెహ్రాన్కు అనుమతిస్తామని చెప్పారు.
cargoship
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలి: కేంద్రమంత్రి జైశంకర్
కాగా, ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయడాన్ని గురించి జై శంకర్ ప్రస్తావిస్తూ....పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించాలని కోరారు.
చట్టబద్ధమైన రక్షణ కోసం ఇరాన్ చేసిన దాడిని కూడా ఆయన సమర్థించారు.