Trump: ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్.. ఏఐ చిత్రాలతో వెక్కిరింత
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పోర్టుల వైపు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే అన్ని నౌకలను తమ నౌకాదళం అడ్డుకుంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలను ఇరాన్ పూర్తిగా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను ఎద్దేవా చేస్తూ కృత్రిమ మేధ సాయంతో పలు చిత్రాలను రూపొందించింది. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈమేరకు చేసిన పోస్టులు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
వివరాలు
పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధికి చెందిన సముద్రపు దొంగలు
ఒక చిత్రంలో ట్రంప్‌ను సముద్రపు దొంగలా చూపిస్తూ ఆయనతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌లను కూడా ప్రతిబింబించారు. దీనికి 'పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధికి చెందిన సముద్రపు దొంగలు' అని వ్యాఖ్య జత చేశారు. మరోవైపు 1980 నాటి ఓ మ్యూజిక్ వీడియోను కూడా అది పోస్టు చేసింది. అందులో కృత్రిమ మేధతో రూపొందించిన దృశ్యంలో ట్రంప్ కీబోర్డ్ వాయిస్తూ కనిపిస్తారు. 'నిన్ను ఎప్పటికీ వదలను.. హర్మూజ్ జలసంధిని మూసేయాలి.. నన్ను అడ్డుకుంటే నేను నిన్ను అడ్డుకుంటా' అని పాట పాడుతున్నట్లుగా చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టులు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అనేకమంది నెటిజన్లు వీటిని షేర్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కీ బోర్డు వాయిస్తున్న ట్రంప్
And today’s popular music: “blockade” by Trump. pic.twitter.com/7EYQ1nSTm7
— Iran Embassy SA (@IraninSA) April 13, 2026
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధికి చెందిన సముద్రపు దొంగలు
The miserable pirates of the Persian Gulf and the Strait of Hormuz. pic.twitter.com/bOzJy9K3Rb
— Iran Embassy SA (@IraninSA) April 13, 2026