LOADING...
Iran: ఇరాన్ 'హిట్‌లిస్ట్'లో 8 వంతెనలు.. గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తత

Iran: ఇరాన్ 'హిట్‌లిస్ట్'లో 8 వంతెనలు.. గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తత

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో అత్యంత కీలకమైన,పెద్ద వంతెనను అమెరికా దాడులతో ధ్వంసం చేశారనే వార్తల నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన టెహ్రాన్, ప్రతీకార చర్యలు తప్పవని స్పష్టం చేస్తూ గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ఎనిమిది ముఖ్య వంతెనలను లక్ష్యంగా చేసుకుని ఒక ప్రత్యేక 'హిట్‌లిస్ట్'ను విడుదల చేసినట్లు సమాచారం. ఇరాన్‌లోని B1 వంతెనపై అమెరికా దాడులు జరిగి అది కూలిపోయిందన్న నివేదికలు వెలువడిన తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ సంఘటన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "ఇది మొదటిదే, ఇంకా కొనసాగుతుంది" అంటూ వ్యాఖ్యానించడం పరిస్థితిని మరింత వేడెక్కించింది.

వివరాలు 

మన్,ఇతర గల్ఫ్ దేశాల్లోని మరికొన్ని ప్రధాన వంతెనలే లక్ష్యం

దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ లక్ష్యాల జాబితాను బయటపెట్టింది. ఇరాన్ గుర్తించిన వంతెనలలో గల్ఫ్ దేశాలకు అత్యంత ప్రాధాన్యం ఉన్న నిర్మాణాలు ఉన్నాయి. సౌదీ అరేబియా,బహ్రెయిన్‌ను కలిపే కింగ్ ఫహద్ కాజ్‌వే, అబుదాబిలోని షేక్ జాయెద్ బ్రిడ్జ్, దోహాలో ఉన్న కతారా బ్రిడ్జ్, కువైట్‌లోని షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా కాజ్‌వే వంటి కీలక వంతెనలు ఈ జాబితాలో చోటు చేసుకున్నాయి. అదనంగా ఒమన్,ఇతర గల్ఫ్ దేశాల్లోని మరికొన్ని ప్రధాన వంతెనలు కూడా లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

ప్రపంచ చమురు సరఫరా గొలుసుపై భారీ ప్రభావం

ఈ వంతెనలపై ఏదైనా దాడి జరిగితే గల్ఫ్ దేశాల మధ్య రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ప్రపంచ చమురు సరఫరా గొలుసుపై కూడా భారీ ప్రభావం పడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అమెరికా తమ కీలక మౌలిక వసతులను దెబ్బతీస్తే, తాము కూడా గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా మిత్రదేశాల వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.

Advertisement