Iran-US war: అమెరికా చర్చల కోసం పాకిస్థాన్'కు ఇరాన్.. వార్తలను ఖండించిన టెహ్రాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య, తమ దేశానికి చెందిన కీలక నేతలు పాకిస్థాన్‌కు వెళ్లి అమెరికాతో చర్చలు జరుపుతున్నారన్న వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ పాకిస్థాన్ వెళ్లలేదని, వారు ఇప్పటికీ టెహ్రాన్'లోనే తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ప్రభుత్వ అనుబంధ మీడియా స్పష్టం చేసింది. తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ, ఫార్స్ న్యూస్ ఏజెన్సీ సంస్థలు కూడా ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాలను పూర్తిగా తప్పుగా పేర్కొన్నాయి.
వివరాలు
10 వేల మంది భద్రతా సిబ్బంది
లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆగకపోతే, అలాగే అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించకపోతే ఎలాంటి చర్చలు జరగవని ఇరాన్ స్పష్టం చేసింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్'లో చర్చల కోసం ఇరాన్ ప్రతినిధి బృందం వెళ్లిందన్న వార్తలు అసత్యమని తెలిపింది. అయితే మరోవైపు పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్, చర్చలకు వచ్చే ప్రతినిధులు, జర్నలిస్టులకు వీసా మినహాయింపులు ఇచ్చామని సోషల్ మీడియాలో తెలిపారు. నగరంలో భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు సుమారు 10 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.
వివరాలు
ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి
ఇదిలా ఉండగా, అమెరికా నాయకుడు JD వాన్స్ చర్చలకు నాయకత్వం వహించేందుకు ఇస్లామాబాద్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, దాని అమలుపై ఇరాన్, అమెరికా, అలాగే ఇజ్రాయెల్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా లెబనాన్ విషయంలో విభేదాలు ఎక్కువగా ఉండగా, బెంజమిన్ నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని అమెరికా ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన ట్వీట్
Pakistan welcomes all delegates including journalists from participating nations, traveling in relation to Islamabad Talks 2026. To this end, all airlines are requested to permit boarding to all such individuals without Visa. Immigration authorities in Pakistan will issue them… pic.twitter.com/mvWJyv2P4s
— Ishaq Dar (@MIshaqDar50) April 10, 2026