Iran: ఖమేనీ హత్యకు ప్రతీకారం తప్పదు: హెచ్చరించిన ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని ఇరాన్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ఖమేనీ మరణాన్ని ఏ విధంగానూ వదిలిపెట్టబోమని ఇరాన్ క్యాబినెట్ ప్రకటించింది. తమ సుప్రీం నేత మృతిపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సంతాపం వ్యక్తం చేసింది. తమ నాయకుడిని హతమార్చిన వారికి కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరించింది. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా భయంకర దాడులు ఎప్పుడైనా జరిగే అవకాశముందని కూడా స్పష్టం చేసింది.
Details
మాజీ రక్షణ మంత్రి అహ్మద్ వహిది కీలక బాధ్యతలు
ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఆపరేషన్‌కు ఐఆర్‌జీసీ సిద్ధమవుతోందని అక్కడి మీడియా వెల్లడించింది. ఇదిలా ఉండగా అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీకి కీలక సలహాదారుడైన అలీ శంఖానితో పాటు ఐఆర్‌జీసీ చీఫ్ మహ్మద్ పాక్పూర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ తాజాగా ధృవీకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐఆర్‌జీసీ తన కొత్త కమాండర్-ఇన్-చీఫ్‌ను నియమించింది. మాజీ రక్షణ మంత్రి అహ్మద్ వహిదికు ఆ బాధ్యతలు అప్పగించినట్లు అధికారికంగా ప్రకటించింది.