Loading...
Iran: హిజాబ్ లేకుండా పాట.. ఇరాన్ గాయనికి 74 కొరడా దెబ్బల శిక్ష
హిజాబ్ లేకుండా పాట.. ఇరాన్ గాయనికి 74 కొరడా దెబ్బల శిక్ష

Iran: హిజాబ్ లేకుండా పాట.. ఇరాన్ గాయనికి 74 కొరడా దెబ్బల శిక్ష

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో మహిళలపై కొనసాగుతున్న ఆంక్షలు మరోసారి అంతర్జాతీయంగా చర్చకు దారితీశాయి. హిజాబ్ ధరించకుండా సంగీత ప్రదర్శన ఇచ్చినందుకు ప్రముఖ గాయని పరస్తూ అహ్మదీకి అధికారులు 74 కొరడా దెబ్బల శిక్ష అమలు చేశారు. యూట్యూబ్‌లో ప్రసారమైన ఆమె సంగీత ప్రదర్శనలో హిజాబ్ లేకుండా కనిపించడమే ఈ చర్యకు కారణమైంది. ఇరాన్‌కు చెందిన గాయని పరస్తూ అహ్మదీ 2024 డిసెంబర్‌లో ఖోమ్ నగరంలో సంగీత ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరో నలుగురు గాయకులతో కలిసి హిజాబ్ ధరించకుండానే పాటలు పాడారు. ఆ సమయంలో ప్రేక్షకులు ఎవరూ లేకుండానే ఈ ప్రదర్శన జరిగింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోకు మిలియన్ల సంఖ్యలో వీక్షణలు వచ్చాయి.

వివరాలు 

రెండేళ్ల పాటు విదేశాలకు వెళ్లకుండా నిషేధం

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఇరాన్ అధికారులు కేసు నమోదు చేశారు.

విచారణ అనంతరం గాయని పరస్తూ అహ్మదీతో పాటు ఆమె బృందంలోని సభ్యులకు కూడా శిక్ష విధించారు. ఒక్కొక్కరికి 74 కొరడా దెబ్బలు వేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

అంతేకాకుండా రెండేళ్ల పాటు విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించింది.

కళా, సంగీత కార్యక్రమాల్లో పాల్గొనకుండా కూడా ఆంక్షలు విధించింది.

ఈ నేపథ్యంలో నవంబర్ 23న గాయని అహ్మదీతో పాటు ఆమె బృందంలోని నలుగురు సభ్యులకు 74 కొరడా దెబ్బల శిక్ష అమలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

వివరాలు 

అమినీ ఘటన తర్వాత మళ్లీ చర్చ

ఇరాన్‌లో మహిళల హక్కులు, హిజాబ్ నిబంధనలపై గతంలోనూ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి.

2022లో అమినీ అనే యువతిని హిజాబ్ నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణలతో నైతిక పోలీసు విభాగం అదుపులోకి తీసుకుంది.

అయితే, పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో ఆమె మరణించింది. ఈ ఘటన అప్పట్లో ఇరాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

ADVERTISEMENT

వివరాలు 

అమినీ ఘటన తర్వాత మళ్లీ చర్చ

మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.

తాజాగా గాయని పరస్తూ అహ్మదీకి విధించిన శిక్షతో మరోసారి ఇరాన్‌లో మహిళల పరిస్థితిపై చర్చ మొదలైంది.

ముఖ్యంగా మహిళల వస్త్రధారణపై ప్రభుత్వ ఆంక్షలు, కళాత్మక వ్యక్తీకరణ, భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన పరిమితులపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

హిజాబ్ ధరించకపోవడం, స్వేచ్ఛగా పాటలు పాడటం వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవడం మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు సవాలుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT