LOADING...
Srilanka: శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ మునక.. 100 మంది గల్లంతు!
శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ మునక.. 100 మంది గల్లంతు!

Srilanka: శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ మునక.. 100 మంది గల్లంతు!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2026
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో శ్రీలంక సముద్రతీరానికి సమీపంలో ఒక అనూహ్య ఘటన జరిగింది. తమ దేశ దక్షిణ తీరానికి దగ్గరలో మునిగిపోతున్న ఇరాన్‌కు చెందిన యుద్ధనౌకలో ఉన్న 32 మంది సిబ్బందిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు శ్రీలంకకు చెందిన ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. రక్షించబడిన వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, మరో ఏడుగురికి అత్యవసర చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.

వివరాలు 

నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది

శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ పార్లమెంటులో మాట్లాడుతూ, ''గాలె తీరానికి సుమారు 40 నాటికల్ మైళ్ల దూరంలో 'ఐఆర్‌ఐఎస్‌ దేనా' (IRIS Dena) అనే ఇరాన్ యుద్ధనౌక ప్రమాదంలో పడినట్లు శ్రీలంక నౌకాదళానికి సమాచారం అందింది. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాం. నౌకాదళ నౌకలు, ఎయిర్‌ఫోర్స్ విమానాలను అక్కడికి పంపించాం. ఆ నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వారిలో దాదాపు 30 మందిని ఇప్పటివరకు రక్షించగలిగాం'' అని తెలిపారు.

వివరాలు 

100 మందికిపైగా సిబ్బంది గల్లంతు  

ఇజ్రాయెల్, అమెరికా దాడులు,ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఆ యుద్ధనౌకకు ఎలా నష్టం జరిగింది? సిబ్బంది ఎలా గాయపడ్డారు? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఆ నౌకపై జలాంతర్గామి దాడి జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఆ దాడి కారణంగా 100 మందికిపైగా సిబ్బంది గల్లంతయ్యారని, మరో 78 మంది వరకు గాయపడినట్లు సమాచారం.

Advertisement