Ayatollah Ali Khamenei: ఇరాన్‌పై ట్రంప్ 25% సుంకాల వేళ.. అమెరికాకు ఖమేనీ హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో వ్యాపారం చేసే అన్ని దేశాలపై 25 శాతం పన్నులు ధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆ దేశ భద్రతపై హెచ్చరికలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. "మా ఇరాన్ దేశం శత్రువుల ముందు భయపడదు. అందుకే, అమెరికా రాజకీయ నాయకులు మోసపూరిత చర్యలు తక్షణం నిలిపి, మా దేశానికి ద్రోహం చేస్తున్నవారిపై ఆధారపడకూడదని మేము హెచ్చరిస్తున్నాం. ఇరాన్ బలవంతమైన దేశం. శత్రువులను ఎదుర్కొనేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము," అని ఖమేనీ ఖాతాలో రాసుకొచ్చారు.
వివరాలు
ఇరాన్‌తో అత్యధికంగా వాణిజ్యం చేసే దేశాలు ఇవే..
ఇరాన్‌పై చర్యలలో భాగంగా, ఆ దేశంపై వైమానిక దాడులు చేపట్టే అవకాశం ఉందని ట్రంప్ యంత్రాంగం ఇటీవల ప్రకటించింది. అదే సమయంలో, 25 శాతం సుంకాలు అమల్లోకి వస్తాయని అధ్యక్షుడు ప్రకటించారు. ఇరాన్‌తో అత్యధికంగా వాణిజ్యం చేసే దేశాల్లో చైనా, తుర్కియే, యూఏఈ, ఇరాక్, భారత్ ఉన్నాయి. ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజల ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ప్రభుత్వానికి మద్దతుగా టెహ్రాన్‌లోని ఎంఘెలాబ్ స్క్వేర్ వద్ద వేలాది మంది ప్రదర్శకులు చేరారు. ఈ సమరంలో, ఇరాన్ దేశాధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తదితరులు కూడా పాల్గొన్నారు.