Page Loader
Iran-Israel: ఇరాన్ ఉగ్రశక్తిగా మారుతోందా..? ఇజ్రాయిల్‌ను గడగడలాడిస్తున్న 'ఫత్తాహ్-1 క్షిపణి'
ఇరాన్ ఉగ్రశక్తిగా మారుతోందా..? ఇజ్రాయిల్‌ను గడగడలాడిస్తున్న 'ఫత్తాహ్-1 క్షిపణి'

Iran-Israel: ఇరాన్ ఉగ్రశక్తిగా మారుతోందా..? ఇజ్రాయిల్‌ను గడగడలాడిస్తున్న 'ఫత్తాహ్-1 క్షిపణి'

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2025
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తాజాగా మరో భారీ దాడికి పాల్పడింది. అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణులతో ఇజ్రాయిల్‌పై దాడి చేసినట్లు అధికారికంగా వెల్లడించింది. ఇదే సమయంలో, సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ జియోనిస్టులపై ఎలాంటి క్షమాభిక్ష చూపబోమని స్పష్టం చేశారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ప్రకారం, తాజా దాడితో ఇజ్రాయిల్ ఆక్రమిత భూభాగాల ఆకాశంపై తమకు పూర్తి ఆధిపత్యం లభించిందని పేర్కొన్నారు. ఈ దాడితో ఆక్రమిత ప్రాంతాల్లోని ప్రజలు ఇరానీ క్షిపణులపై పూర్తిగా నిరాశ్రయులుగా మారిపోయారని IRGC అధికారికంగా ప్రకటించింది.

Details

ఆపరేషన్ హానెస్ట్ ప్రమిస్ III - 11వ దాడి 

ఇదే దాడిని ఇరాన్ "ఆపరేషన్ హానెస్ట్ ప్రమిస్ III"గా పేర్కొంది. ఇది ఇప్పటివరకు జరిగిన 11వ దాడిగా పేర్కొన్నారు. ఇందులో అత్యాధునిక ఫత్తాహ్-1 మిసైళ్లను వినియోగించారు. ఇదే మోడల్ మిసైళ్లను గతేడాది జెరూసలెంపై జరిగిన "ఆపరేషన్ ట్రూ ప్రమిస్ II" సమయంలోనూ ప్రయోగించినట్లు గుర్తు చేశారు.

Details

ఖమెనీ హెచ్చరిక 

తాజా దాడి అనంతరం ఖమెనీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "జియోనిస్టు ఉగ్రవాద ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది. మేము వారిపై ఎలాంటి క్షమాభిక్ష చూపించమంటూ ధీటుగా బదులిచ్చారు. అంతేకాకుండా, "ఇరానీయులు మా పక్కనే ఉన్నారు. వారంతా సైనిక బలగాలను మద్దతుగా నిలుస్తున్నారు. అల్లాహ్‌ దయతో ఇస్లామిక్ రిపబ్లిక్ విజయం సాధిస్తుందని ఖమెనీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.