Israeli Hamas war : గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి- హాస్పిటల్ కింద హమాస్ స్థావరం
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) బుధవారం ఉదయం అల్ షిఫా ఆసుపత్రి పశ్చిమ భాగంలో ఇజ్రాయెల్ దళాలు దాడి చేసింది. ఈ దాడులను ఆస్పత్రి వర్గాలు కూడా ధృవీకరించారు. ఇజ్రాయెల్ సైన్యం అల్-షిఫా ఆసుపత్రిలోకి బుధవారం ప్రవేశించింది. ఈ ఆసుపత్రి కింద హమాస్‌కు సంబంధించిన కమాండ్ సెంటర్ ఉందని సైన్యం ఆరోపించింది. హమాస్ ఉగ్రవాదులను లొంగిపోవాలని అల్-షిఫా హాస్పిటల్‌పై సైనిక చర్యకు పాల్పడినట్లు సైన్యం తెలిపింది. పౌరులను కవచంగా చేసుకునేందుకు హమాస్ మిలిటెంట్లు ఆస్పత్రిని స్థావరంగా చేసుకున్నట్లు ఆరోపించింది. అందుకే ఆస్పత్రిలోని పౌరులకు త్వరగా బయటకు పంపేందుకు సైన్యం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడిని హమాస్ మిలిటెంట్లు ఖండించారు. దీనికి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గాజా స్ట్రిప్‌లోకి ఐక్యరాజ్యసమితి ట్రక్కులకు ఇజ్రాయెల్ అనుమతి
గాజా స్ట్రిప్‌లోకి ఐక్యరాజ్యసమితి పంపిన ట్రక్కులకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆమోదం తెలిపారు. ఈ ట్రక్కుల్లో 24,000 లీటర్ల డీజిల్ ఉన్నట్లు ఐరాస తెలిపింది. గాజా స్ట్రిప్‌లో ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలకు వినియోగించే వాహనాల కోసం ఈ డీజిల్‌ను వినియోగించనున్నారు. హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నందున గాజాలోని పాలస్తీనియన్లకు ఆహారం, నీరు, మందులను పంపిణీ చేసేందుకు ఇంధన కొరత ఏర్పడిట్లు ఐరాస సంస్థలు తెలిపాయి. ఈ క్రమంలో యూఎన్ ఇంధన ట్యాంకులను గాజాకు పంపింది. అక్టోబరు 7న ప్రారంభమైన ఇజ్రాయెల్ -హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం వల్ల ఇప్పటి వరకు 11,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయెల్‌లో, 1,200 మందికి పైగా మరణించారు