Page Loader
హమాస్ మిలిటెంట్లను వెంబడించి కాల్చి చంపిన ఇజ్రాయెల్ పోలీసులు.. వీడియో వైరల్ 
హమాస్ మిలిటెంట్లను వెంబడించి కాల్చి చంపిన ఇజ్రాయెల్ పోలీసులు.. వీడియో వైరల్

హమాస్ మిలిటెంట్లను వెంబడించి కాల్చి చంపిన ఇజ్రాయెల్ పోలీసులు.. వీడియో వైరల్ 

వ్రాసిన వారు Stalin
Oct 10, 2023
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్- హమాస్ గ్రూప్ మధ్య యుద్ధం భయంకరంగా సాగుతోంది. తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ పోలీసులు విడుదల చేసిన ఓ వీడియో వైరల్‌‌గా మారింది. ఇద్దరు హమాస్ ఉగ్రవాదులను ఇజ్రాయెల్ పోలీసులు వెంబడిస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. కారులో వెళ్తున్న మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు వెంబడిస్తూ వారిపై కాల్పులు జరిపారు. చాలాదూరం వెళ్లిన తర్వాత ఆ కారు ఆగిపోయింది. అనంతరం కారులో ఉన్న వారిపై పోలీసులు బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో క్షణాల్లోనే కారులోని ఇద్దరు హమాస్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దృశ్యాలన్నీ ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. గత 4రోజులుగా జరుగుతున్న ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో రక్తపాతం జరుగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 900మంది ఇజ్రాయెల్ ప్రజలు, గాజా స్ట్రిప్‌లో 704మంది చనిపోయారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇజ్రాయెల్ పోలీసులు విడుదల చేసిన వీడియో