Israel shares video: 'అల్-షిఫా' ఆస్పత్రిలో బందీలను దాచిపెట్టిన హమాస్ ఉగ్రవాదులు.. వీడియో విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్-షిఫాను హమాస్ మిలిటెంట్లు తమ స్థావరంగా ఉపయోగించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ మొదటి నుంచి వాదిస్తోంది.
ఇప్పుడు వాదనలకు బలం చేకూర్చేలా ఒక వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది.
అల్-షిఫా ఆస్పత్రిలో బందీలను హమాస్ దాచిపెట్టిన వీడియోను ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఇజ్రాయెల్ పంచుకుంది.
అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు కొందమందిని ఇజ్రాయెల్ దేశస్తులతో పాటు విదేశీయులను బందీలుగా పట్టుకున్నారు.
ఈ క్రమంలో బందీలుగా పట్టుకున్న వారిలో కొంతమందిని హమాస్ మిలిటెంట్లు అల్-షిఫా ఆస్పత్రిలో దాచిపెట్టారు. ఈ దృశ్యాలు హస్పిటల్ సీసీ కెమరాల్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియోనే ఇప్పుడు ఇజ్రాయెల్ విడుదల చేసింది.
గాజా
ఆస్పత్రి కింద సొరంగం.. అందులో ఏముంది?
ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన ఆ వీడియోలో తీవ్రంగా గాయపడిన ఒక బందీని అల్-షిఫా ఆస్పత్రిలోకి తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది.
అలాగే.. మరొక వ్యక్తిని బలవంతంగా ఆస్పత్రి లోపలికి లాక్కొస్తున్నట్లు ఆ వీడియోలో చూడవచ్చు. పక్కన ఆయుధాలతో హమాస్ ఉగ్రవాదులు కూడా కనిపిస్తారు.
ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్ దళాలు ఇప్పటికే అల్-షిఫా ఆస్పత్రిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలో సైన్యం ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో అల్-షిఫా ఆస్పత్రి కింద ఒక సొరంగాన్ని కూడా ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది.
ఈ సొరంగం ఆస్పత్రి కింద 10మీటర్ల లోతులో ఉందని, 55 మీటర్ల వరకు పొడవు ఉంటుందని సైన్యం పేర్కొంది. అయితే అందులో ఏం ఉందనే విషయాన్ని మాత్రం ఇజ్రాయెల్ చెప్పలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆస్పత్రిలో బందీలను దాచిపెట్టిన హమాస్ ఉగ్రవాదులు
EXPOSED: This is documentation from Shifa Hospital from the day of the massacre, October 7, 2023, between the hours of 10:42 a.m and 11:01 a.m. in which hostages, a Nepalese civilian and a Thai civilian, were abducted from Israeli territory are seen surrounded by armed Hamas… pic.twitter.com/a5udjBw4wF
— Israel Defense Forces (@IDF) November 19, 2023