Loading...
Netanyahu: ఇజ్రాయెల్ ఎన్నికలను అరబ్ పార్టీలు దొంగిలించాయి.. నెతన్యాహు సంచలన ఆరోపణలు
ఇజ్రాయెల్ ఎన్నికలను అరబ్ పార్టీలు దొంగిలించాయి.. నెతన్యాహు సంచలన ఆరోపణలు

Netanyahu: ఇజ్రాయెల్ ఎన్నికలను అరబ్ పార్టీలు దొంగిలించాయి.. నెతన్యాహు సంచలన ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
08:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఉత్కంఠ రేపాయి. ఏ కూటమికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అరబ్ నేతృత్వంలోని పార్టీలు లంచాలు, బెదిరింపులు, హింసకు పాల్పడి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశాయని విమర్శించింది. బుధవారం నాటికి దాదాపు 90 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్‌ (నెస్సెట్‌)లో నెతన్యాహు నేతృత్వంలోని మితవాద కూటమికి 53 సీట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ సైన్యాధిపతి గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి 48 స్థానాల్లో నిలిచింది.

వివరాలు 

కింగ్‌మేకర్‌గా అరబ్ పార్టీలు..

ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు అవసరం.

అయితే ఈ సంఖ్యను ఏ కూటమి కూడా సాధించలేకపోవడంతో తదుపరి ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఈ ఎన్నికల్లో అరబ్ నేతృత్వంలోని జాయింట్ లిస్ట్, రామ్ పార్టీలు గణనీయమైన స్థానాలను సాధించాయి.

గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు రెట్టింపు సీట్లు దక్కించుకుని మొత్తం 19స్థానాలను కైవసం చేసుకున్నాయి.

దీంతో ప్రభుత్వ ఏర్పాటులో ఈ పార్టీల మద్దతు కీలకంగా మారింది. ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఈ పార్టీలే కింగ్‌మేకర్‌గా అవతరించాయి.

ఈ పరిణామం నెతన్యాహు వర్గంలో ఆందోళనకు కారణమైంది. మరోవైపు,ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం 77శాతానికి చేరింది. గత 25ఏళ్లలో ఇదే అత్యధిక ఓటింగ్‌గా నమోదైనట్లు సమాచారం.

వివరాలు 

అక్రమాలు జరిగాయని లికుడ్ పార్టీ ఆరోపణలు..

అరబ్ పార్టీలపై లికుడ్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఉగ్రవాదానికి, ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనే లక్ష్యాలకు మద్దతు ఇచ్చే అరబ్ పార్టీలు ఎన్నికలను దొంగిలించాయని ఒక ప్రకటనలో ఆరోపించింది.

ఓటర్లను ప్రలోభపెట్టడం, పోలింగ్ అధికారులను బెదిరించడం, నకిలీ ఓట్లు వేయడం వంటి అక్రమాలకు పాల్పడ్డాయని పేర్కొంది.

ఈ ఆరోపణలకు సంబంధించి వందలాది సాక్ష్యాలు, ఆధారాలను పోలీసులకు, సెంట్రల్ ఎలక్షన్స్ కమిటీకి అందించినట్లు లికుడ్ పార్టీ వెల్లడించింది.

ఎన్నికల్లో విస్తృతంగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ

ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు కూటముల నేతలూ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు.

మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి రాకుండా, వివిధ పార్టీలతో చర్చలు జరిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ పిలుపునిచ్చారు.

తుది ఎన్నికల ఫలితాలు వెల్లడై కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు బెంజమిన్ నెతన్యాహు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు.

తదుపరి ప్రభుత్వం ఏర్పాటులో చిన్న పార్టీలు, ముఖ్యంగా అరబ్ నేతృత్వంలోని పార్టీల మద్దతు కీలక పాత్ర పోషించే అవకాశముంది.

ADVERTISEMENT