
Israel Hamas War: గాజాలో 24 గంటల్లో 150 మంది పాలస్తీనియన్లు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
గాజా వేదికగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు ఇరువైపులా 26వేల మంది చనిపోయారు.
ఒక వైపు కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నా.. తుపాకుల మోత మాత్రం ఆగడం లేదు.
గత 24గంటల్లో గాజా ప్రాంతంలో 150మంది మరణించారని, 313మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉత్తర గాజాలో అంతకుముందు రోజు 15మందికి పైగా హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
హమాస్ నియంత్రణలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. తాజా మరణాలతో ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 26,900కు చేరుకుంది.
చనిపోయిన పాలస్తీనియన్లలో ఎక్కువ మంది మహిళలు మరియు పిల్లలు ఉన్నట్లు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
హమాస్
హమాస్ డిమాండ్లను తిరస్కరించిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కాల్పుల విరమణ ప్రతిపాదన నేపథ్యంలో హమాస్ చేసిన రెండు ప్రధాన డిమాండ్లను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తిరస్కరించారు.
గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్ సైన్యం వెళ్లిపోవాలని, అలాగే తమ మిలిటెంట్లను విడుదల చేయాలని హమాస్ డిమాండ్ చేసింది.
కానీ ఈ రెండు ప్రతిపాదనలను నెతన్యాహు తిరస్కరించారు. అదే సమయంలో అంతర్జాతీయ కోర్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను కూడా నెతన్యాహు విమర్శించారు.
ఇజ్రాయెల్ దేశం తమప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రతి దేశంలాగే ఇజ్రాయెల్‌కు కూడా తన సమగ్రతను కాపాడుకునే హక్కు ఉందని ఆయన అన్నారు.