NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Israel Hamas war: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దాళాలు.. హమాస్ మిలిటెంట్ల కోసం వేట షురూ
    తదుపరి వార్తా కథనం
    Israel Hamas war: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దాళాలు.. హమాస్ మిలిటెంట్ల కోసం వేట షురూ
    గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దాళాలు.. హమాస్ మిలిటెంట్ల కోసం వేట షురూ

    Israel Hamas war: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దాళాలు.. హమాస్ మిలిటెంట్ల కోసం వేట షురూ

    వ్రాసిన వారు Stalin
    Oct 14, 2023
    12:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హమాస్ మిలిటెంట్లను తుద ముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో తమ సైన్యం గాజా స్ట్రిప్ లోపల చిన్న చిన్న దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

    ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించించి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు.

    తమ దేశం ఇప్పుడే ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించిందని అన్నారు. తమ బలగాలు సింహాల్లా పోరాడుతున్నాయన్నారు.

    భావిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పలేనన్నారు. శత్రువులు చేసిన దురాగతాలను ఎప్పటికీ మరచిపోమన్నారు. వారిని ఎప్పటికీ క్షమించేదిలేదన్నారు.

    అక్టోబర్ 7న హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌ ప్రజలు 1,300 మందికి పైగా మరణించారు, గాజా, వెస్ట్ బ్యాంక్‌లో 1,900 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

    గాజా

    గాజా ప్రజలకు 24గంటల డెడ్ లైన్ విధించిన ఇజ్రాయెల్

    గాజాలోని పాలస్తీయులు 24గంటల్లో ఈ ప్రాంతాన్ని విడిచివెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం డెడ్ లైన్ విధించింది.

    దీంతో ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులకు పాల్పడుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో గాజాలోని ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని, దక్షిణ గాజావైపు వెళ్లిపోయారు.

    డెడ్ లైన్ గడువు ముగిసిత తర్వాత, ఇజ్రాయెల్ దళాలు భూమార్గం గుండా గాజాలోకి ప్రవేశించాయి.

    24గంటల గడువు ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ దళాలు గాజాలోకి ప్రవేశించాయి.

    అయితే, ఉత్తర గాజా నుంచి పారిపోతున్న పౌరులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటోందని హమాస్ ఆరోపించింది.

    దక్షిణ దిశగా వెళుతున్న ప్రజలపై ఇజ్రాయిలీలు జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 70 మంది చనిపోయినట్లు హమాస్ తెలిపింది. అయితే ఈ దాడిపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు.

    గాజా

    24గంటల్లో తరలింపు అసాధ్యం: ఐక్యరాజ్య సమితి

    గాజాలోని ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం 24గంటల గడవు ఇవ్వడంపై ఐక్యరాజ్య సమితి స్పందించింది.

    గాజాలోని 1.1 మిలియన్ల మందిని 24 గంటల్లో వెంటనే దక్షిణాదికి మకాం మార్చడం అసాధ్యమని చెప్పింది.

    జనాభాను బలవంతంగా తరలించడం మానవత్వానికి విరుద్ధం అని వెల్లడించింది.

    ఇజ్రాయెల్ వైమానిక దాడులు, షెల్లింగ్ కారణంగా మరణించిన, గాయపడిన వారి సంఖ్యను తెలుసుకోవడానికి, చికిత్సను అందించడానికి గాజాలోని ఆసుపత్రులు కష్టపడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది.

    గాజాలోని ఆరోగ్య వ్యవస్థ విచ్ఛిన్నమైపోయిందని వెల్లడించింది.

    గాజా

    రాయిటర్స్ జర్నలిస్టు మృతి

    గాజాలోని సమాన్య ప్రజలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియాలోని ఇతర దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

    పాలస్తీనియన్లకు మద్దతుగా బీరూట్, ఇరాక్, ఇరాన్, జోర్డాన్, బహ్రెయిన్‌లలో వేలాది మంది నిరసనలు తెలిపారు.

    ఇదిలా ఉంటే, మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం.. లెబనాన్ మిలిటెంట్ గ్రూపు హిజ్బుల్లా మధ్య సరిహ్దదులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    పరస్పరం కాల్పులకు పాల్పడుతున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో రాయిటర్స్ వీడియో జర్నలిస్ట్ మరణించగా, మరో ఇద్దరు రాయిటర్స్ రిపోర్టర్లు, ఏఎఫ్‌పీ ఇద్దరు జర్నలిస్తులు గాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్
    హమాస్
    పాలస్తీనా

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఇజ్రాయెల్

    పాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాల దాడి; 11మంది మృతి పాలస్తీనా
    ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు కోవిడ్
    న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్ న్యాయ శాఖ మంత్రి
    ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు లెబనాన్

    హమాస్

    ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు  ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి.. అమెరికా-ఇరాన్ 6 బిలియన్ డాలర్ల ఒప్పందానికి లింకేంటి? అమెరికా
    ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి వెనుక ఇరాన్‌ హస్తం  ఇజ్రాయెల్
    ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులు ఎలా ఉన్నారు? కేంద్రం ఏం చెబుతోంది?  ఇజ్రాయెల్

    పాలస్తీనా

    ఇజ్రాయెల్‌‌లో యుద్ధ మేఘాలు.. గాజా నుంచి 5,000 రాకెట్లు ప్రయోగించిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్
    India issues advisory : ఇజ్రాయెల్‌‌లో భారతీయులకు కేంద్రం కీలక సూచనలు  ఇజ్రాయెల్
    హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ మేయర్ సహా 22 మంది మృతి  ఇజ్రాయెల్
    ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం.. ఇరు దేశాల్లో 500 మందికి పైగా మృతి  ఇజ్రాయెల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025