తదుపరి వార్తా కథనం

Israel-Hamas: గాజా సరిహద్దు సమీపంలో ఇజ్రాయెల్ మిస్‌ఫైర్.. సొంత ప్రజల మీద బాంబు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 16, 2025
01:34 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) దళం గాజాలోని హమాస్‌పై జరిపే దాడుల భాగంగా, ఇటీవల ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
గాజా సరిహద్దు సమీపంలోని నిర్ యిట్జాక్ ప్రాంతంలో ఐడీఎఫ్ ఫైటర్ జెట్ నుంచి ఓ బాంబు జారిపడింది.
ఈ ఘటన సాంకేతిక తప్పిదం వల్ల చోటుచేసుకున్నట్లు ఐడీఎఫ్ అంగీకరించింది. ఈ ప్రాంతంలో సుమారు 550 మంది ఇజ్రాయెల్ ప్రజలు నివసిస్తున్నారు.
Details
ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు
అయితే ఈ సంఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
ఇది జరిగిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజాలో పర్యటించేందుకు వెళ్లి, తన సైన్యాన్ని ఉద్దేశించి హమాస్‌పై కొనసాగుతున్న దాడుల గురించి వ్యాఖ్యానించారు.
హమాస్‌కు తాము హెచ్చరిస్తూనే ఉన్నామని, బందీలను విడుదల చేయాలని తాము ఒత్తిడి చేస్తున్నామని ఆయన చెప్పారు.