Page Loader
ఇజ్రాయెల్ దాడిలో 'హమాస్' వైమానిక దళాల చీఫ్ హతం 
ఇజ్రాయెల్ దాడిలో 'హమాస్' వైమానిక దళాల చీఫ్ హతం

ఇజ్రాయెల్ దాడిలో 'హమాస్' వైమానిక దళాల చీఫ్ హతం 

వ్రాసిన వారు Stalin
Oct 14, 2023
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

గాజా స్ట్రిప్‌లో తమ సైన్యం వైమానిక దాడిలో హమాస్ మిలిటెంట్ గ్రూప్ కీలక నాయకుడు హతమైనట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దాడిలో చనిపోయింది హమాస్ వైమానిక శ్రేణి చీఫ్ అధిపతి అబు మురాద్‌గా గురించారు. హమాస్ గ్రూప్ తన వైమానిక కార్యకలాపాలను నిర్వహించే ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడిలో అబూ మురాద్ కీలక పాత్ర పోషించాడు. అలాగే, ఇజ్రాయెల్‌పై దాడి చేసిన స్థలాలను గుర్తించి, వాటిపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పేర్కొంది. హమాస్- ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరు వైపులా భారీ ప్రాణ నష్టం జరిగింది. ఇజ్రాయెల్‌లో 1,300మందికి పైగా.. గాజాలో 1,530మందికి పైగా మృతి చెందారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసిన దృశ్యం