Israel: గాల్లో కేబుల్స్ తెగి కొండపై కూలిన ఇజ్రాయెల్ హెలికాప్టర్.. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన UH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ రికవరీ ఆపరేషన్ సమయంలో కొండపై కూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాలే అమోస్ సమీపంలోని వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా మంగళవారం గుష్ ఎట్జియన్ ప్రాంతంలో UH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ చేసింది. అప్పటి నుంచి అదే ప్రాంతంలో హెలికాప్టర్ నిలిచిపోయింది. దీంతో దాన్ని తరలించేందుకు శుక్రవారం ఇజ్రాయెల్ రక్షణ దళాలు రికవరీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా CH-53 యాసూర్ హెవీ-లిఫ్ట్ హెలికాప్టర్ సాయంతో UH-60 బ్లాక్ హాక్‌ను బలమైన కేబుల్స్‌తో గాల్లోకి ఎత్తి తరలించే ప్రయత్నం చేశారు.
Details
నియంత్రణ కోల్పోయి కొండపై కూలిపోయింది
అయితే హెలికాప్టర్ గాల్లో ఉండగానే కేబుల్స్ ఒక్కసారిగా తెగిపోవడంతో UH-60 బ్లాక్ హాక్ నియంత్రణ కోల్పోయి సమీపంలోని కొండపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని ఇజ్రాయెల్ వైమానిక దళ చీఫ్ మేజర్ జనరల్ టోమర్ బార్ తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రత్యేక లిఫ్టింగ్ పరికరాల సమగ్రత, సైనిక పునరుద్ధరణ (రికవరీ) ప్రక్రియల్లో అనుసరించాల్సిన భద్రతా ప్రోటోకాల్‌లపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో తీవ్రమైన చలిగాలులు వీచుతున్నాయని, ఆ కారణంగా సైనిక కార్యకలాపాలతో పాటు పౌరుల కార్యకలాపాలు కూడా పరిమితంగానే కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల మధ్యనే ఈ ప్రమాదం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Another visual of the UH-60 Black Hawk helicopter falling off during the recovery lift operation in the West Bank near Ma’ale Amos.#helicopter https://t.co/3Ef9kLL9d1 pic.twitter.com/R75U6DgKhZ
— FL360aero (@fl360aero) January 16, 2026