Human Cat: పిల్లిలా మారేందుకు 20 సర్జీలు చేయించుకున్న మహిళ.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే?
విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలని కొందరు.. మంచి కారు కొనుక్కోవాలని మరికొందరు.. బాగా డబ్బు సంపాదించాలని ఇంకొందరు కలలు కంటుంటారు. కానీ ఇటలీకి చెందిన ఒక మహిళ కల గురించి మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. చియారా డెల్ అబేట్ అలియాస్ ఐడిన్ మోడ్ అనే 22 ఏళ్ల ఇటాలియన్ మహిళ పిల్లిగా మారడమే తన జీవితాశయంగా ఆమె బతుకుతోంది. అంతేకాకుండా పిల్లిగా తన రూపాన్ని మార్చుకునేందుకు ఆ మహిళ తన శరీరానికి ఇప్పటి వరకు 20 సర్జీలు చేయించుకుంది. ప్రస్తుతం పిల్లిరూపంలోకి తన శరీరాకృతిని పాక్షికంగా మార్చుకున్న చియారా డెల్ అబేట్ వీడియోలు టిక్‌టాక్‌లో వైరల్‌గా మారాయి.
పిల్లి ఆకృతి కోసం శరీరంపై 72కుట్లు.. ప్రైవేటు భాగాలపై కూడా..
పిల్లిలా కనిపించాలనేది చియారా చిన్ననాటి కల. కలను నెరవేర్చుకోవడానికి 20 బాడీ మోడిఫికేషన్స్ చేయించుకుంది. చియారా తన మొత్తం శరీరంపై మొత్తం 72చోట్ల కుట్లను వేయించుకుంది. ఇందులో ముక్కు, పెదవులు, ప్రైవేట్ భాగాలపై కూడా కుట్లు ఉన్నాయి. తన నాలుక కూడా రెండు భాగాలుగా అయ్యేలా ఆపరేషన్ చేయించుకుంది. చియారా తన కనురెప్పల నుంచి కొవ్వును తొలగించడానికి పిల్లిలా కనిపించడానికి కాస్మెటిక్ సర్జరీ కూడా చేయించుకుంది. ఆమె చెవులను పిల్లి చెవుల ఆకారంలోకి మారడానికి శాశ్వత ఐలైనర్ అప్లై చేసింది. అంతేకాకుండా పిల్లి మాదిరిగా ఉండే గోర్లను కూడా ధరించింది. తన 11సంవత్సరాల వయస్సు నుంచి చియారా పిల్లిలా మారేందుకు సర్జీలు చేయించుకుటోంది. భవిష్యత్తులోనూ చాలా మార్పులు చేసుకోవాలని ఆమె ప్లాన్ చేస్తోంది.
పూర్తిగా పిల్లిగా మారడానికి మరికొన్ని సర్జరీలకు రెడీ
పూర్తి పిల్లి రూపాన్ని పొందడానికి చియారా పెదాలు, తన దంతాల ఆకారాన్ని మార్చుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ఆమె తన పెదవిని కత్తిరించుకోనున్నట్లు చియారా చెప్పింది. అలాగే ఆమె పిల్లి లాంటి తోకను కలిగి ఉండటం కోసం, టాటూలను వేయించుకోవాలని ఆలోచిస్తోంది. శరీరాకృతిని మార్చుకునే ప్రతి సర్జరీ చేయించుకున్నప్పుడు చాలా బాధగా ఉంటుందని, అయితే ఈ నొప్పి తాత్కాలికమేనని, భరించడం నాకు పెద్ద విషయం కాదని చియారా అంటోంది. తాను పిల్లిలా మారాలనుకోవడం సరైనదని భావిస్తున్నానని, ఎందుకంటే తనకు పిల్లులంటే చాలా ఇష్టమని ఆమె వివరించింది.
మానసిక రోగి అంటూ.. చియారాపై నెటిజన్ల విమర్శలు
చియారా తన పిల్లి లుక్‌తో టిక్-టాక్‌లో వీడియోలను కూడా చేస్తుంది. అమె వీడియోలు వైరల్ మారాయి. ఈ క్రమంలో ఆమె వీడియోలను చూసిన నెటిజన్లు చియారాను విమర్శిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు ఆమెను మానసిక రోగి అంటూ స్పందిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఆమెను అభినందిస్తున్నారు. చాలా మంది తన బాడీ మోడిఫికేషన్‌ను ఇష్టపడ్డారని, స్వేచ్ఛగా జీవిస్తున్నందుకు తనను అభినందిస్తున్నారని చియారా చెప్పింది. తనను కొందరు విమర్శిస్తున్నా.. తాను నిజాయితాగా ఉండటానికి సంకోచిచను అని చియారా తేల్చి చెప్పింది.