LOADING...
India Slams Pakistan: 'ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో పెట్టారు, అసిమ్ మునీర్‌కు సర్వాధికారాలు': ఐక్యరాజ్యసమితిలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు
ఐక్యరాజ్యసమితిలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు

India Slams Pakistan: 'ఇమ్రాన్ ఖాన్‌ను జైలులో పెట్టారు, అసిమ్ మునీర్‌కు సర్వాధికారాలు': ఐక్యరాజ్యసమితిలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐరాస వేదికపై పాకిస్థాన్ మరోసారి పరువు పోగొట్టుకొంది. ప్రపంచ ప్రసంగ వేదికలో శాంతి, స్థిరత్వం అంశాలు చర్చింపబడుతున్న సమయంలోనే, జమ్మూకశ్మీర్ విషయంలో పాక్ తన కుటిల మార్గాన్ని ప్రదర్శించింది. దీనికి భారత్‌ గట్టిగా బదులిచ్చింది. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపిన తర్వాత, అతడికి విరోధి అయిన ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు పూర్తి అధికారం ఇచ్చిన తీర్పుపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం కోరుకుంటున్నామని తెలిపారు. కానీ, శాంతి ఏకపక్షంగా ఉండకూడదంటూ.. జమ్ముకశ్మీర్‌ వివాదంపై సమస్య ఇంకా మిగిలిఉందన్నారు భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేశిందని కూడా పాక్ ఆరోపించింది.

వివరాలు 

 భారత్‌కు, దేశ ప్రజలకు ముప్పు కలిగించడమే పాక్ లక్ష్యం 

ఈ వ్యాఖ్యలకు యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ కఠినంగా సమాధానం ఇచ్చారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు పూర్తిగా భారత భాగమని పునరుద్ఘాటించారు. భారత్‌కు, దేశ ప్రజలకు ముప్పు కలిగించడమే పాక్ ప్రాధాన్య లక్ష్యమని విమర్శించారు. "65 సంవత్సరాల క్రితం భారత్ విశ్వాసంతో, స్నేహభావంతో సింధూ జలాల ఒప్పందాన్ని రూపొందించింది. కానీ ఆ సమయంలో పాక్ మూడు యుద్ధాలు, వేలాది ఉగ్రదాడులకు పాల్పడి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. గత నాలుగు దశాబ్దాలుగా పాక్ మద్దతుతో ఉగ్రవాదుల దాడుల వల్ల పదివేల మందికి పైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారు" అని హరీశ్ అన్నారు.

వివరాలు 

ప్రస్తావనకు పహల్గాం ఉగ్రదాడి

ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడిని కూడా ప్రస్తావించారు. పాక్ ఉగ్రవాద చర్యల కారణంగా భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తీర్పును గుర్తుచేశారు. ఏ రూపంలోనైనా ఉగ్రవాదం వచ్చినా భారత్ దానిని శక్తిమంతంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. అంతేకాక, పాక్‌లో ప్రస్తుత ప్రజాస్వామ్యం, రాజకీయ పరిస్థితులపై కూడా హరీశ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపి, రక్షణ దళాల చీఫ్ ఆసిమ్ మునీర్‌కు సర్వాధికారాలు అప్పగించిన ఘనత ఆ దేశానికే దక్కుతుందని వ్యాఖ్యానించారు.

Advertisement