Pakistan: భారత్ పై దాడి చేయడానికి జైషే విరాళాలు
ఈ వార్తాకథనం ఏంటి
హిజుబుల్ ముజాహుద్దీన్ ... పేరు మోసిన, కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ. పాకిస్థాన్ ప్రేరేపిత సంస్థ కూడా. ఈ గుంపు లక్ష్యం ప్రధానంగా భారత్‌ను గురిపెట్టడమే. భారత్‌లో దాడులు జరపడానికి అవసరమైన నిధులను నిరంతరం సేకరిస్తూ ఉంటుందని భారత దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఎనిమిదేళ్ల వ్యవధిలో ఈ సంస్థ దాదాపు 80 కోట్ల రూపాయలు కూడగట్టినట్టూ అధికారులు పేర్కొన్నారు. పారిస్‌లో జరిగిన ఉగ్రదాడుల అనంతరం,అక్కడి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు నిధులు ఎలా చేరుతున్నాయో పరిశీలిస్తోంది. ఆ టాస్క్ ఫోర్స్‌కు సమర్పించిన నివేదికలో భారత్ ఈ వివరాలను చేర్చింది. నిధులు భారత్ కు చేరగానే వివిధ మార్గాల వాటిని పంచుతారని నివేదించారు.
వివరాలు
నిధులలో పెద్ద భాగం పాకిస్థాన్ నుంచే..
ముఖ్యంగా దేశంలో తలదాచుకున్న ఉగ్రవాదులకు, అలాగే పోలీసుల చేతిలో, లేదా ఉగ్రదాడుల్లో పాల్గొన్న వారి కుటుంబసభ్యులకు ఆ డబ్బుని చేరుస్తారని విన్నవించారు. ఈ నిధులలో పెద్ద భాగం పాకిస్థాన్ నుంచే వస్తోందని కూడా భారత అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన ముంబై దాడులను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయని సభ్యదేశాలకు వివరించారు. అంతేకాక, 2011 సెప్టెంబర్ 7న ఢిల్లీ హైకోర్టు వద్ద హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రదాడి జరిపి, అందులో 17 మంది ప్రాణాలు కోల్పోయి, 76 మంది గాయపడ్డ ఘటనను గుర్తు చేశారు. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ అండదండలతోనే ఈ ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని భారత వైపు స్పష్టం చేసింది.