
Japan: జపాన్‌లో వెంటవెంటనే 21 భూకంపాలు.. భారత ఎంబసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌లోని పశ్చిమ తీరప్రాంతంలో సోమవారం బలమైన భూకంపాలు సంభవించాయి.
దాదాపు 21భూకంపాలు 4.0తీవ్రతతో వెంటవెంటనే రావండతో ఆ దేశ ప్రభుత్వం అప్రమత్తమైంది.
తీర ప్రాంతంలో సునామీ హెచ్చరికలను జారీ చేసింది. దీంతో తీర ప్రాంతంలోకి ప్రజలను ఖాళీ చేయాలని ఆదేశించింది.
వరుస భూకంపాల నేపథ్యంలో జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం అలర్ట్ అయ్యింది.
సునామీకి సంబంధించి సమాచారాన్ని ప్రవాస భారతీయులకు అందించేందుకు రాయబార కార్యాలయంలో అత్యవసర కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.
+81-80-3930-1715 (యాకుబ్ టోప్నో)
+81-70-1492-0049 (మిస్టర్ అజయ్ సేథి)
+81-80-3214-4734 ( D. N. బెర్నౌల్)
+81-80-6229-5382 (S. భట్టాచార్య)
+81-80-3214-4722 (వివేక్ రాథీ)
sscons.tokyo@mea.gov.in offseco.tokyo@mea.gov.in
ఈ ఫోన్, మెయిల్ ద్వారా సమాచారాన్నితెలుసుకోవాలని భారత రాయబార కార్యలయం వెల్లడించింది.
జపాన్
34,000 ఇళ్లకు నిలిచిపోయిన కరెంట్
జపాన్‌లో భూకంపం సంభవించిన తర్వాత తూర్పు తీరంలోని గాంగ్వాన్ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం పెరగవచ్చని దక్షిణ కొరియా వాతావరణ సంస్థ తెలిపింది.
వరుస భూకంపాల నేపథ్యంలో వేలాది ఇళ్లు బీటలు వారాయి. కరెంట్ స్తంభాలు కూలిపోయాయి.
ప్రకంపనల నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. దాదాపు 34,000 ఇళ్లకు కరెంట్ నిలిచిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.
దేశ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ NHK ప్రకారం.. మొదటిసారి 7.6 ప్రాథమిక తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా జపాన్ సముద్ర తీరంలోని కొన్ని ప్రాంతాలలో 1 మీటర్ మేర అలలు ఎగిసిపడ్డాయి.
భూకంపం వల్ల ఫుకుయ్ ప్రిఫెక్చర్ ప్రాంతంలో ఐదుగురు గాయపడ్డారు. అయితే వీరికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు పేర్కొన్నారు.