Japan: వెయ్యి కి.మీ.రేంజ్ మిస్సైళ్లు.. శిక్షణకు భారత్ సాయం కోరుతున్న జపాన్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, జపాన్ మధ్య రక్షణ రంగంలో సహకారం మరింత పెరుగుతోంది. తమ సైనికులకు అత్యాధునిక క్షిపణులను ప్రయోగించే విషయంలో శిక్షణ అందించేందుకు భారతదేశంలోని శిక్షణా కేంద్రాలను ఉపయోగించుకోవాలని జపాన్ యోచిస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు తమ దేశానికి చెందిన సైనిక అధికారులను భారత్‌కు పంపినట్లు జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జీఎస్‌డీఎఫ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మసయోషి అరాయ్ వెల్లడించారు. సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఉపరితలం నుంచి నౌకలపై దాడి చేసే క్షిపణులను సమర్థంగా ప్రయోగించేలా సైనికులకు శిక్షణ ఇవ్వడం తమకు సవాలుగా మారిందని అరాయ్ తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు జపాన్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ శిక్షణ పొందే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
వివరాలు
ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసేందుకే ఈ చర్య
ఇందులో భాగంగానే భారత్‌తో చర్చలు జరుపుతున్నామని వివరించారు.
క్షిపణుల వినియోగంతోపాటు చిన్న తరహా దాడి డ్రోన్లను ప్రయోగించే అవకాశాలపైనా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రాంతీయ భద్రతా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్‌ను జపాన్ కీలక భాగస్వామిగా పరిగణిస్తోంది.
ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని టోక్యో భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, భారత్‌తో ఉన్న సంబంధాలకు సంబంధించిన సున్నితమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని చర్చల పూర్తి వివరాలను వెల్లడించలేనని జనరల్ అరాయ్ పేర్కొన్నారు.
వివరాలు
భారత్‌లో పర్యటించిన 34 మంది సభ్యుల బృందం
ఇదిలా ఉండగా, ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ కమాండ్‌కు చెందిన 34 మంది సభ్యుల బృందం భారత్‌లో పర్యటించింది.
ఈ సందర్భంగా భారత సైన్యం, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అధికారులతో సమావేశమైంది.
వార్‌డెక్, క్లావ్స్ వంటి కేంద్రాలను సందర్శించి భారత రక్షణ రంగ సామర్థ్యాలు, సైనిక శిక్షణ విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరాలు తెలుసుకుంది.
ఈ పర్యటనతో భారత్, జపాన్ సైనిక అధికారుల మధ్య వృత్తిపరమైన సంబంధాలు మరింత బలోపేతం కావడానికి అవకాశం ఏర్పడింది.