
Japan: కోవిడ్ తర్వాత STSS అంటే వణికిపోతున్న టోక్యో ప్రజలు
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ కోవిడ్-ఆంక్షలను సడలించిన తరువాత మరో వ్యాధితో భయకంపితులవుతోంది.
అక్కడ చేపలు తిన్న వారికి 48 గంటల్లో ప్రజలను చంపగల అరుదైన బ్యాక్టీరియా విస్తరిస్తుందని బ్లూమ్‌బెర్గ్ శనివారం తెలిపింది.
స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే కణజాలాల్లో చిన్నపాటి వృత్తాకార వలయం(STSS) గా ఏర్పడే ఒరకమైన ప్రమాదకరమైన వ్యాధి. ఇది సోకితే 48 గంటలలోపు ప్రాణాంతకం కావచ్చు.
వివరాలు
977 -STSS కేసులు నమోదు
ఈ సంవత్సరం జూన్ 2 నాటికి జపాన్‌లో 977 STSS కేసులు నమోదయ్యాయి. ఇది గత సంవత్సరం నమోదైన 941 కేసుల కంటే ఎక్కువగా వుంది.
ఈ సంగతిని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రకారం ధృవీకరించింది. ఇది 1999 నుండి వస్తున్న వ్యాధులను నమోదు చేస్తోంది.
గ్రూప్ A స్ట్రెప్టోకోకస్ (GAS) సాధారణంగా "స్ట్రెప్ థ్రోట్" అని పిలవబడే పిల్లలలో వాపు , గొంతు నొప్పికి కారణమవుతుంది.
అయితే కొన్ని రకాల బాక్టీరియా అవయవ నొప్పి , వాపు, జ్వరం, తక్కువ రక్తపోటు వంటి లక్షణాలను కలిగి వుంటుంది. తగిన చికిత్స తీసుకోకపోతే వేగంగా వృద్ధిచెందుతుందని పేర్కొంది.
వివరాలు
బ్లూమ్‌బెర్గ్ ప్రకారం నెక్రోసిస్,శ్వాస సమస్యలు,అవయవ వైఫల్యం, మరణం
"చాలా మరణాలు 48 గంటల్లోనే జరుగుతాయి" అని టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్శిటీలో అంటు వ్యాధుల ప్రొఫెసర్ కెన్ కికుచి చెప్పారు.
"ఒక రోగి ఉదయం పాదంలో వాపును గమనించిన వెంటనే.. అది మధ్యాహ్న సమయానికి మోకాలి వరకు విస్తరిస్తుందని తెలిపారు.
వారు 48 గంటల్లో చనిపోవచ్చు," అని ఆయన చెప్పారు.50 ఏళ్లు పైబడిన వారు ఈ వ్యాధికి ఎక్కువ అవకాశం ఉంది.
ప్రస్తుత ఇన్ఫెక్షన్ల రేటు ప్రకారం, జపాన్‌లో ఈ సంవత్సరం కేసుల సంఖ్య 2,500కి చేరుకోవచ్చని, "భయంకరమైన" మరణాల రేటు 30% ఉందని కికుచి తెలిపారు.
వివరాలు
పరిశుభ్రతే మంత్రం
ప్రజలు చేతుల పరిశుభ్రత పాటించాలని , బహిరంగ గాయాలకు చికిత్స చేయాలని కికుచి ప్రజలను కోరారు.
పేషెంట్లు తమ పేగుల్లో గ్యాస్‌ను విడుదల చేసే క్రమంలో ఇది మలం ద్వారా వస్తుందని వివరించారు. అది చేతులను కలుషితం చేస్తుందని ఆయన హెచ్చరించారు.
బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, జపాన్‌తో పాటు, అనేక ఇతర దేశాలు స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ ఇటీవలి కాలంలో ఎదుర్కొన్నాయి. 2
022 చివరలో, కనీసం ఐదు యూరోపియన్ దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇన్వాసివ్ గ్రూప్ A స్ట్రెప్టోకోకస్ (iGAS) వ్యాధి కేసుల పెరుగుదలను సూచించాయి.
ఇందులో STSS కూడా ఉంది. కోవిడ్ ఆంక్షల తర్వాత కేసులు పెరిగాయని WHO తెలిపింది.