Japan earthquake: 7.1 తీవ్రతతో భూకంపం.. జపాన్‌లో సునామీ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ దక్షిణ ప్రాంతాన్ని మంగళవారం 7.1 తీవ్రత గల శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
వివరాలు
అత్యవసర చర్యలు చేపట్టిన అధికారులు..
జపాన్ వాతావరణ సంస్థ (JMA) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ భూకంపం దేశంలో భూకంపాల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే షిండో (Shindo) స్కేల్‌లో అత్యంత ఉన్నత స్థాయి అయిన '7' తీవ్రతను నమోదు చేసింది.
దీంతో సంబంధిత ప్రాంతాల్లో అత్యవసర చర్యలు చేపట్టిన అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్..
BREAKING A strong 7.1-magnitude earthquake hit southern Japan on Tuesday, the Japan Meteorological Agency said, issuing a tsunami alert.
— AFP News Agency (@AFP) July 28, 2026
The tremor also measured at the highest possible level seven on Japan's own Shindo scale of shaking, the agency said pic.twitter.com/WlHEyRXihR