LOADING...
JD Vance: అమెరికా-ఇరాన్ చర్చల్లో జేడీ వాన్స్‌కు అవమానం.. వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్ల చర్చ
వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్ల చర్చ

JD Vance: అమెరికా-ఇరాన్ చర్చల్లో జేడీ వాన్స్‌కు అవమానం.. వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్ల చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 22, 2026
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు దారితీసే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా,ఇరాన్ ప్రతినిధులు ఆదివారం స్విట్జర్లాండ్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ చర్చలకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. వాటిలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లు కనిపించడంతో చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

ఫొటో సెషన్‌కు ఇరాన్ నిరాకరణ

చర్చలు ప్రారంభానికి ముందు ఇరాన్ ప్రతినిధులతో కరచాలనం, సంయుక్త ఫొటో సెషన్ ఏర్పాటు చేయాలని అమెరికా ప్రతినిధులు భావించినట్లు ఐఆర్‌జీసీ అనుబంధ వార్తాసంస్థ 'తస్నిమ్' వెల్లడించింది. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను ఇరాన్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. హెజ్‌బొల్లా కార్యకలాపాల విషయంలో ఇరాన్ జోక్యం చేసుకోకపోతే మళ్లీ దాడులు జరగవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించడంతో టెహ్రాన్ ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా ప్రతినిధులతో కలిసి ఫొటో సెషన్‌లో పాల్గొనడానికి ఇరాన్ బృందం నిరాకరించినట్లు, అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ పరిణామాలు సమావేశ వాతావరణాన్ని ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చినట్లు తెలుస్తోంది.

వివరాలు 

వైరల్ అయిన జేడీ వాన్స్ వీడియో

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోల్లో జేడీ వాన్స్ కొంత దూరంలో నిలబడి పరిస్థితులను గమనిస్తున్నట్లు కనిపించారు. ఆ తర్వాత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌తో కలిసి చర్చిస్తున్న దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామాలు సమావేశంలో నెలకొన్న ఉద్రిక్తతకు అద్దం పట్టినట్లు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

వివరాలు 

ఖతార్ ప్రధాని వ్యవహారంపై చర్చ

మరో వైరల్ వీడియోలో ఖతార్ ప్రధాని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను పలకరించగా, పక్కనే ఉన్న జేడీ వాన్స్‌తో మాట్లాడకపోవడం కనిపించింది. ఈ దృశ్యాలపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని దౌత్యపరమైన నిర్లక్ష్యంగా అభివర్ణిస్తుండగా, మరికొందరు సాధారణ సంఘటనను అతిగా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. కీలక అంశాలపై చర్చలు ప్రారంభంలో ఉద్రిక్తతలు కనిపించినప్పటికీ అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగాయి. టెహ్రాన్ అణు కార్యక్రమం, లెబనాన్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు వంటి కీలక అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో స్థిరత్వం, శాంతి నెలకొల్పే దిశగా ఈ చర్చలు సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జేడీ వాన్స్‌కు ఇబ్బందికర పరిస్థితి

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జేడీ వాన్స్‌ను పట్టించుకోలేదా?

Advertisement