H1B Visa: అమెరికన్లకే ఉద్యోగాలు.. శిక్షణ కోసం మాత్రమే హెచ్1బీ వీసాలు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో నైపుణ్య నిపుణుల కొరత ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన వెంటనే, అక్కడి ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్1బీ వీసా విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఉద్యోగ అవకాశాలపై ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో, అసలు ప్రభుత్వం భావిస్తున్న దిశను ఆయన వెల్లడించారు. అమెరికాలో ఉద్యోగాలు నైపుణ్యం కలిగినవారికే లభిస్తాయి. విదేశీ నిపుణులను దేశానికి తీసుకువచ్చి, వారి సహకారంతో అమెరికన్లకు శిక్షణ ఇవ్వాలి. మూడు నుంచి ఏడు సంవత్సరాల అనంతరం ఆ వీసాదారులు తిరిగి తమ దేశాలకు వెళ్లాలి. అలా చేస్తే అమెరికన్లకు మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని బెసెంట్ పేర్కొన్నారు.
Details
సెమీ కండక్టర్ పరిశ్రమను తీసుకురావడమే లక్ష్యం
అలాగే అమెరికా తయారీరంగం గత 20-30 సంవత్సరాలుగా మందకొడిగా సాగుతోందని, నౌక నిర్మాణం కూడా చాలాకాలంగా నిలిచిపోయిందని వివరించారు. సెమీకండక్టర్ పరిశ్రమను అమెరికాకు తిరిగి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఇక మరోవైపు, దేశంలోని వీసా కార్యక్రమాలు కొనసాగుతాయని అమెరికా అంతర్గత భద్రతా విభాగం కార్యదర్శి క్రిస్తీ నియోమ్ స్పష్టం చేశారు.