Page Loader
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో భారీ అగ్నిప్రమాదం
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో భారీఅగ్నిప్రమాదం

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో భారీ అగ్నిప్రమాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2023
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లోని గురువారం తెల్లవారుజామున బహుళ అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 52 మంది మరణించారని మరో 43 మంది గాయపడ్డారని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ తెలిపినట్లు,వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. భవనం నుండి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను చాలావరకు ఆర్పివేశామని.. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి గల గల కారణాలు, నష్టం ఎంత అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో భారీ అగ్నిప్రమాదం